పిటిఐ అధ్యక్ష పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ తొలగింపు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి పాకిస్థాన్ దేశ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. తన పార్టీ పీటీఐ అధ్యక్ష పదవి నుంచి ఇమ్రాన్‌ను తొలగించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. తోషాఖానా కేసులో భాగంగా ఇమ్రాన్‌ను పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించడంతో కమిషన్ ఈ చర్య తీసుకుంది. 

మాజీ ప్రధానికి నోటీసు జారీ చేసి డిసెంబర్ 13న విచారణకు నిర్ణయించామని ఈసీపీ (పాకిస్థాన్‌ ఎలక్షన్‌ కమిషన్‌) ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నట్టు ప్రముఖ వార్తాపత్రిక డాన్ తన కథనంలో తెలిపింది.ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తోషాఖానా నుంచి వచ్చిన ఖరీదైన గడియారాలు, ఇతర బహుమతులను రాయితీ ధరలకు కొనుగోలు చేసి లాభాలకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈసీ రికార్డ్స్‌ ప్రకారం.. 1974లో స్థాపించిన తోషాఖానా నుంచి బహుమతులను రూ.21.5మిలియన్ల (రూ.2.15 కోట్లు) కు కొనుగోలు చేసి.. వాటిని రూ.108 మిలియన్ల (రూ.10.8కోట్లు)కు విక్రయించినట్లు తేలింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 63ఐపీ ప్రకారం పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు వేసింది.