ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉదయ 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ప్రధాని మోడి ప్రసంగిస్తున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోదీ తెలిపారు. 

రాజ్యసభ చైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో బాధ్యతలను ధన్కర్ సమర్ధవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రైతుబిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం సంతోషంగా ఉందని ప్రధాని చెప్పారు. ధన్కర్ కు చట్టాలపై ఎంతో అవగాహన ఉందని అంటూ ఈ సభతో పాటు దేశం తరుపున ధన్కర్కు అభినందనలు తెలిపారు.

 జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని కొనియాడారు. ‘రైతు పుత్రుడు’ అని అభివర్ణించారు. బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల మొదటిరోజు సభాకార్యక్రమాలను చేపట్టిన ధన్‌ఖడ్‌కు మోదీ స్వాగతం పలుకుతూ”సభ తరఫున, దేశం తరఫున చైర్మన్‌ను నేను అభినందిస్తు్న్నాను. 

ఎన్నో ఆటుపోట్ల నడుమ మీరు ఈ స్థాయికి ఎదిగారు. దేశ ప్రజలకు ఇదెంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. చైర్మన్ పదవికి మరింత వన్నె పెరిగింది” అని మోదీ సభలో మాట్లాడుతూ చెప్పారు. కిసాన్ పుత్రుడైన ఉపరాష్ట్రపతి సైనిక్ స్కూలులో చదివారని, ఆవిధంగా ఆయన జవాన్లతోనూ, కిసాన్లతోనూ సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజన తరగతుల నుంచి వచ్చారని, ఆమెకు ముందు పదవిని చేపట్టిన రామ్‌నాథ్ కోవింద్ కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చారని గుర్తుచేశారు

జీ20 బాధ్యతలు చేపట్టిన సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని మోదీ పేర్కొన్నారు. జీ20 సదస్సుకు సన్నద్ధం కావాల్సిన సమయమిదని చెప్పారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ మంచి వేదిక అని చెప్పారు. ఇది అమృతకాలం ప్రారంభసమయమని తెలిపారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సులభంగా బాధ్యతతో సాధించడంలో మన పార్లమెంటు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని తెలిపారు. దేశానికి రాజ్యసభ అతిపెద్ద బలం అని.. మన ప్రధానులు చాలా మంది రాజ్యసభ సభ్యులుగా పనిచేశారని చెప్పారు.

కాగా, బుధవారం ప్రారంభమైన రాజ్యసభ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకూ జరుగనున్నాయి. గుజరాత్ ఎన్నికల కారణంగా రాజ్యసభ సమావేశాలు షెడ్యూల్ సమయం కంటే నెలరోజులు ఆలస్యంగా మొదలయ్యాయి.

పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోడి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెబుతూ జీ-20 సదస్సును భారత్‌ నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. 

ఈ సమావేశాలు భారత్‌కు చాలా కీలకమని పేర్కొంటూ కొత్త ఎంపీలకు , యువ ఎంపీలకు ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు సభలో అవకాశం లభించాలని సూచించారు. మొదటి వారం వేడిగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సభలో ప్రధాని ప్రసంగిస్తున్నారు. పార్ల‌మెంట్‌లో ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు ప్ర‌ధాన మంత్రి, చైర్మ‌న్‌కి సభతో పాటు దేశం తరపున కూడా అభినందనలు తెలిపారు.