
భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన రాజమౌళిని ప్రతిష్టాకరమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా ఎంపిక చేసింది.ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడి ఒక టాలీవుడ్ సినిమా ఈ ఘనత సాధించిందంటే రాజమౌళి గొప్పతనం ఏంటో తెలుస్తుంది.
1935 నుంచి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఈ అవార్డ్స్ ఇస్తుంది. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఆన్‌లైన్ పబ్లికేషన్స్ కు సంబంధించిన సభ్యులు ఒక బృందంగా ఏర్పడి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. ఇటీవలే సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఆర్ఆర్ఆర్ విజేతగా నిలిచింది.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా మరో నాలుగు అంతర్జాతీయ చిత్రాలతో పోటీపడి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకుల విభాగంలో రాజమౌళి రన్నరప్‌గా నిలిచారు. బెస్ట్ ఎడిటింగ్ విభాగంలోనూ ఈ చిత్రం రన్నరప్‌గా ఉంది. ఇప్పటికే శాటర్న్, సన్‌సెట్ సర్కిల్ వంటి పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ సినిమాను నేరుగా 14 కేటగిరీల్లో ఆస్కార్ కు పంపించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలను చేస్తోంది.
ఇటీవలే లాస్ ఏంజిల్స్ టైమ్స్ అనే ఇంగ్లీష్ పేపర్ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్ ప్రచురించింది కూడా. భారత దేశపు బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషించాడు.
డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో అలియాభట్, ఒలీవియా మొర్రీస్‌లు కథానాయికలుగా నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 25న విడుదలై ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సంచలనం విజయం సాధించింది. ఓవరల్‌గా రూ. 1200కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి రాజమౌళికి వరుసగా రెండోసారి రూ. 1000 కోట్ల క్లబ్‌లో నిలిచిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఇటీవలే జపాన్ లో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది.
హీరోతో సంబంధం లేకుండా కేవలం ఈయన పేరుతోనే సినిమాకు వందల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది. ‘బాహుబలి’తో టాలీవుడ్ స్థాయిని పెంచిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో ఏకంగా భారతీయ సినిమా స్థాయిని పెంచాడు. ముఖ్యంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు భారతీయ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేశాడు. రాజమౌళి టేకింగ్‌కు, విజన్‌కు హాలీవుడ్ దర్శకులు, టెక్నీషియన్‌లు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాతో రాజమౌళి ఇప్పటికే ఎన్నో అవార్డులను సాధించాడు.
More Stories
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు!
నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు