గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో సోమవారం నుంచి ఎంపిక చేసిన రైతులకు డ్రోన్లపై శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. వ్యవ దిగుబడులు సాధించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం పెంచాలసాయరంగంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి నూతన ఆధునిక సాంకేతికతతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 1961 రైతు భరోసా కేంద్రాల్లో డ్రోన్ల పై శిక్షణ ఇచ్చేందుకు రైతులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది. 738 ఆర్బీకేల్లో ఇప్పటికే ఒక్కొక్క కేంద్రంలో అయిదుగురు రైతులతో గ్రూపులను ఏర్పాటు- చేయగా, మిగతా ఆర్బీకేల్లో డిసెంబరు 15 నాటికి ఎంపికలను పూర్తి చేయాలని నిర్ణయించింది.
డ్రోన్లపై శిక్షణలో భాగంగా రిమోట్ పైలట్ ట్రైనింగ్ కోర్సు (ఆర్పీటీసీ)కు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి అన్ని అనుమతులు లభించగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రైతులు సోమవారం నుంచి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఐ) నిబంధనల మేరకు 18 నుంచి 65 సంవత్సరాల వయసు కలిగి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, డిప్లొమా, కనీసం ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న వారిని ప్రాధాన్యతా క్రమంలో డ్రోన్ల పైలట్ శిక్షణకు ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. శిక్షణ అనంతరం డీజీజీఐ సర్టిఫికేట్ అందచేయనుంది.
ఒక్కొక్క బ్యాచ్ కు 20మంది చొప్పున 12 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీని కోసం యూనివర్సిటీ ప్రత్యేక పాఠ్య ప్రణాళికను తయారు చేసింది. 10 ప్రధాన పంటల్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. తరగుతులు, అనుకరణ, మరమ్మతు, నిర్వహణతో పాటు ఫీల్డ్ లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ శిక్షణ కోసం ఒక్కొక్క రైతుకు ఖర్చయ్యే రూ 17 వేలను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.
More Stories
ఏపీ ఏకైక రాజధాని అమరావతి మాత్రమే
సరుకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు
బంగ్లాదేశ్ ఉదంతంలో పౌర సమాజం స్పందించాలి