స్వదేశీ సాఫ్ట్ డ్రింక్ రస్నా కంపెనీ చైర్మెన్ అరీజ్ ఫిరోజ్‌షా కంబట్టా (85) కన్నుమూశారు. “ఐ లవ్ యూ రస్నా” ప్రకటన ద్వారా ఈ బ్రాండ్ బాగా ప్రాచుర్యం పొందింది. దాదాపు 60 దేశాల్లో ఇప్పుడు ఈ బ్రాండ్ ను విక్రయిస్తున్నారు. ఎన్ని బహుళజాతి కంపెనీలు వచ్చినప్పటికీ ఈ విభాగంలో మార్కెట్ లీడర్ గా రస్నా నిలుస్తోంది.
రస్నా ప్రపంచంలోనే అతిపెద్ద శీతల పానీయాల తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలలో రస్నా ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. సాప్ట్ డ్రింక్ రేట్లు పెరిగిన సమయంలోనూ కేవలం ఐదు రూపాయలకే రస్నా ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకువచ్చి అరీజ్ పిరోజ్‌షా కొత్త ట్రెండ్ క్రియెట్ చేశారు.
ఐదు రూపాయల రస్నా ప్యాకెట్ ద్వారా సుమారు 32 గ్లాసుల సాఫ్ట్ డ్రింక్‌లను తయారు చేయవచ్చు. ఒక్కో గ్లాసుకు కేవలం 15 పైసలు మాత్రమే. 1980, 90 దశకాల్లో ఐ లవ్ యూ రస్నా యాడ్ ఎంతో ఫేమస్ అయింది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అయిన రస్నాకు మంచి ఆదరణ లభించింది.
రస్నా ఫౌండేషన్‌తో పాటు బెనవోలెంట్ ట్రస్టుకు ఆయన చెర్మెన్‌గా ఉన్నారు. ప్రపంచ పార్సి ఇరానీ జార్తోస్టిస్ సంఘానికి చైర్మెన్ గా కూడా చేశారు. భారతీయ పరిశ్రమలు,వ్యాపారానికి కంబట్టా ఎంతో సహకరించినట్లు రస్నా గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. సమాజ సేవ ద్వారా సామాజిక మార్పు కోసం కంబట్టా ప్రయత్నించినట్లు తెలిపారు.
స్వదేశీ డ్రింక్‌ను రస్నా బ్రాండ్‌తో కంబట్టా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సుమారు 18 లక్షల రిటైల్ షాపుల్లో ఆ బ్రాండ్ ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. ప్రపంచంలోనే సాఫ్ట్ డ్రింక్‌ను తయారు చేస్తున్న అతిపెద్ద కాన్‌సెంట్రేట్ మాన్యుఫాక్చరర్‌గా రస్నా సంస్థ నిలుస్తుంది. బెవరేజ్ సెగ్మెంట్‌లో ఆ ఉత్పత్తి మార్కటె్ లీడర్‌గా ఉంది. 1970ల్లో రస్నా సాఫ్ట్ డ్రింక్ ప్యాకెట్లను క్రియేట్ చేశారు ఫిరోజ్‌షా కంబట్టా. అయిదు రూపాయల రస్నా ప్యాకెట్ ద్వారా సుమారు 32 గ్లాసుల సాఫ్ట్ డ్రింక్‌లను తయారు చేయవచ్చు.
More Stories
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం
మహా కుంభ మేళాకు వెళ్లే వారికి 13వేల రైళ్లు
బిలియనీర్లు అధికంగా ఉన్న దేశాలలో మూడో స్థానంలో భారత్