భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్ఆర్ఓ) ఈ నెల 24న పీఎస్‌ఎల్‌వీ సీ-54 ప్రయోగం చేపట్టనున్నది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని స్పేస్‌సెంటర్ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. ఓషన్‌శాట్-3 సహా ఎనిమిది నానో ఉపగ్రహాలను సీ-54 రాకెట్ కక్షలో ప్రవేశపెట్టనున్నది.
శనివారం ఉదయం 11.56 గంటలకు ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఓషన్‌శాట్-3తో పాటు భూటాన్ శాట్, ఆనంద్, ధ్రువ స్పేస్ నుంచి రెండు టైబోల్ట్ శాటిలైట్లను, నాలుగు ఆస్ట్రోకాస్ట్ శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపనున్నది.
ఓషన్‌శాట్ భూ పరిశీలన ఉపగ్రహం కాగా.. ఇప్పటికే ఓషన్‌శాట్ సిరీస్‌లో ఓషన్‌శాట్-1, ఓషన్‌శాట్-2 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో మూడో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.
సముద్రం, వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ.. తుఫానుల అంచనా వేయడానికి ఓషన్‌శాట్ సిరీస్ శాటిలైట్స్ ఉపయోగపడుతున్నాయి. ఇదే సిరీస్‌లో ఓషన్‌శాట్-3ఏ ఉపగ్రహాన్ని వచ్చే ఏడాదిలో నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.

More Stories
సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
యూట్యూబర్ నందనని నాలుగు గంటల విచారణ
లండన్ జాబ్స్ పేరిట ఘరానా మోసం.. యూట్యూబర్ నందన అరెస్ట్