చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ముగ్గురు మంత్రులు!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌కు గురువారం సిట్‌ నోటీసులు ఇచ్చింది. నవంబర్‌ 21న ఉదయం 10:30కి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న రామచంద్రభారతికి శ్రీనివాస్‌ ఫ్లైట్‌ టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి
 
చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం వెల్లడవుతున్నది. హైదరాబాద్‌‌‌‌కు చెందిన ముగ్గురు మంత్రులతో చికోటి ప్రవీణ్‌‌‌‌కు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 
 
చికోటి క్యాసినో నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో  18 మంది ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, 280 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దానితో, ఈ కేసుకు సంబంధించి ఈడీ 100 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది.
 
కాగా ఇప్పటికే టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులైన మహేష్, ధర్మేంద్ర యాదవ్ లు నిన్న ఈడీ ముందుకు హాజరు అయిన విషయం తెలిసిందే. వైఎస్సార్.సిపి మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, వైఎస్సార్.సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు కలసి గురువారం విచారణకు హాజరయ్యారు. 
పంజాగుట్టలోని ఊర్వశి బార్ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ దే. ఫారిన్ ఎక్స్ చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను ఉల్లంఘించారనే అభియోగాలను గురునాథ్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డిలను కూడా ఈడీ అధికారులు విచారించారు.
గోవా, నేపాల్‌‌, థాయ్‌‌లాండ్‌‌, హాంకాంగ్‌‌లో క్యాసినోకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని ఈడీ విచారిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ పీఏ హరీశ్ కు కూడా నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై హరీశ్​ను వివరణ కోరగా ‘‘నో కామెంట్‌‌’’ అంటూ జవాబిచ్చారు. సికింద్రాబాద్‌‌కు చెందిన మరో ముగ్గురికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. శని, సోమవారాల్లో బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం.
ఏపీ, తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు చీకోటి క్యాసినో బిజినెస్‌‌‌‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. హాంకాంగ్‌, ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌, గోవాలో ప్లేయింగ్‌‌‌‌ కార్డ్స్‌‌‌‌, క్యాసినో క్లబ్స్‌‌‌‌ కోసం ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ చేసినట్లు ఆధారాలు రాబట్టారు.
గోవా, నేపాల్‌‌‌‌లో క్యాసినో లీగల్ కావడంతో అక్కడే పదుల సంఖ్యలో క్యాసినో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు, బినామీల పేర్లతో సెంటర్లు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మరి ఈ కేసులో  ఇంకెంత మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో చూడాలి.