అమిత్‌ షా తరపున కోర్టుకు హాజరైనా…. జస్టిస్‌ లలిత్‌

న్యాయ నియామకాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి నేతల ప్రయేముందని, వారికి కావాల్సినవారినే కీలక పదవుల్లో నియమించుకుంటున్నారనే విమర్శలను కొట్టిపారవేస్త గతంలో తాను ఓ కేసులో అమిత్ షా తరపున కోర్టుకు హాజరయ్యానని  సుప్రీంకోర్టు తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌ స్పష్టం చేశారు.
 
 జాతీయ వార్తా సంస్థ ఎన్‌డిటివి ప్రతినిధికి విచ్చిన ఇంటర్వ్యూలో అయితే తాను అమిత్ షాకు ప్రధాన న్యాయవాదిగా హాజరు కాలేదని, ప్రధాన న్యాయవాది రామాజెట్మాలాన్ కు సహాయకునిగా హాజరయ్యానని తెలిపారు. అయితే, తనను న్యాయమూర్తిగా నియమించి పక్రియ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడడానికి ముందుగానే, 2013లో ప్రారంభమైనదని ఆయన పేర్కున్నారు. 
 
గతంలో గుజరాత్‌కు సంబంధించిన సోహ్రాబుద్దీన్‌ షేక్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో తాను అమిత్‌ షా తరపున కోర్టుకు హాజరైన మాట వాస్తవమేనని జస్టిస్‌ లలిత్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ఎన్‌డిటివి ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘ఔను అమిత్‌ షా తరపున హాజరైన మాట నిజం. అయితే రామ్‌ జెఠ్మలానీ నేతృత్వంలోనే హాజరయ్యాం’ అని ఆయన తెలిపారు. 
 
కేంద్రంలో 2014 మే నెలలో ప్రభుత్వం మారినప్పటికినీ అంతకంటే ముందుగానే అంటే యుపిఎ అధికారంలో ఇంకా ఉండగానే ‘జడ్జి అవుతారా?’ అని తనను అడిగారని, అంటే ప్రభుత్వ మార్పిడికి ముందుగానే ఈ ప్రక్రియ మొదలైందని ఆయన చెప్పారు.
 
 ‘నేను ఈ కేసులో ఎప్పుడూ ప్రధాన న్యాయవాదిగా హాజరుకాలేదు. అమిత్‌ షా సహా నిందితుడు తరుపున దీనికి అనుబంధ కేసులో వాదించాను. కానీ ప్రధాన కేసులో కాదు’ అని జస్టిస్‌ లలిత్‌ స్పష్టం చేశారు.
 
 కొలిజియమే భేష్‌
 
కాగాన్యాయ నిమాకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొలిజియం వ్యవస్థే సరైన, సమతుల్య మార్గమని జస్టిస్‌ లలిత్‌ పేర్కొన్నారు. కొలిజియం వ్యవస్థకు సుప్రీంకోర్టులోని ఐదురుగు న్యాయమూర్తుల ధర్మాసనం ఆమోదం తెలిపిందని ఆయన గుర్తు చేశారు. న్యాయ నియామకాల మొత్తం ప్రక్రియలో భాగంగా తప్పనిసరిగా ప్రభుత్వం, కొలిజియం మధ్య సంప్రదింపులు జరగాలని చెప్పారు. 
 
తాను సిజెఐగా ఉన్న కాలంలో నియామకాలు కాకపోవడంపై తనకు అసంతృప్తి ఏమీ లేదని తెలిపారు. అయితే కర్ణాటక నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా చాలా మంచి ప్రతిభ గల సీనియర్‌ న్యాయవాదిని సిఫార్సు చేశామని, కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రక్రియ ముందుకు సాగలేదని విచారం వ్యక్తం చేశారు. 
 
ఆయన దాదాపు ఏడాదిగా వేచి చూస్తున్నారని, కొలిజియంకు లేఖ రాసి హైకోర్టు న్యాయమూర్తిగా ఉండేందుకు సమ్మతిని ఉపసంహరించుకున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ ప్రతిభ గల ఒక న్యాయ నిపుణుడిని నియమించుకోలేకపోయిందని చెప్పారు. 
 
మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, అయితే చాలా తక్కువ మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ఆయన తెలిపారు. దాన్ని అదిగమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉండాలని, కానీ ప్రస్తుతం 27 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. 
 
కేసుల ఒత్తిడి చాలా ఎక్కువ ఉందని తెలిపారు. న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత రాజ్యసభ, గవర్నర్‌ పదవులు తీసుకోవడం సరైనది కాదని భావిస్తున్నట్లు చెబుతూ, తనకు అటువంటి అవకాశం వస్తే నిరాకరిస్తానని జస్టిస్‌ లలిత్‌ స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్ చట్ట ప్రకారం రిటైర్డ్ న్యాయమూర్తులను నియమించే పదవులు చేపట్టడం సబబే అని తెలిపారు.  ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా కేసు అత్యవసర లిస్టింగ్‌పై జస్టిస్‌ యయు లలిత్‌ వివరణ ఇస్తూ అదేమీ అసాధారణం కాదని పేర్కొన్నారు.