
‘‘ ఆధార్ నంబర్ ఉన్న వ్యక్తులు.. ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతి 10 ఏళ్లకోసారి ధృవీకరణ పత్రాలను అప్‌డేట్ చేసుకోవాలి. కనీసం ఒక్కసారైనా ఈ ప్రక్రియ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ , ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పత్రాలను సమర్పించి అప్‌డేట్ చేసుకోవచ్చు. సీఐడీఆర్‌లో ఖచ్చితమైన సమాచారాన్ని కొనసాగించేందుకు కాలానుగుణంగా అప్‌డేట్ చేసుకోవాలి’’ అని గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది.
యుఐడిఏఐ ‘అప్‌డేట్ డాక్యుమెంట్’ అని ఓ కొత్త ఫీచర్‌ని కూడా డెవలప్‌చేసింది. మై ఆధార్ పోర్టల్ లేక మై ఆధార్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో లేక దగ్గరలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్ రంలో కూడా అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఇప్పటి వరకు 134 కోట్ల ఆధార్ నంబర్లను జారీచేశారు. ఇప్పుడు ఎంత మంది అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. గత ఏడాది దాదాపు 16 కోట్ల మంది వివిధ విషయాలను అప్‌డేట్ చేసుకున్నారు. దాదాపు 650 రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, 315 కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్ అథంటికేషన్‌నే వాడుతున్నారు.
More Stories
ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు
మహాకుంభ్‌లో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు
కేరళ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి