విలువైన ప్రాచీన భాండాగార రికార్డుల సంరక్షణ

ఉత్తమ పరిపాలన విధానాలు, రికార్డుల నిర్వహణ, వినూత్న విధానాలతో కార్యాలయాల స్థల యాజమాన్యం ప్రధాన అంశాలుగా అక్టోబర్  2 నుంచి 31 వరకు ప్రత్యేక ప్రచారం 20 కార్యక్రమం అమలు జరిపారు. మొత్తం ప్రభుత్వం విధాన స్పూర్తితో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం పర్యవేక్షణలో కార్యక్రమం అమలు జరిగింది. 

కార్యక్రమంలో భాగంగా  శతాబ్దాల చరిత్ర కలిగిన అత్యంత విలువైన చరిత్రాత్మక పత్రాలను భద్రపరచడానికి నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సహకారంతో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం   అనేక  కార్యక్రమాలు చేపట్టింది. గ్రంథాలయాల్లో  ప్రదర్శించడానికి వీలుగా  కొన్ని పత్రాలను అభివృద్ధి చేశారు. 

మొదటిసారిగా సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ హిందీ అనువాదం కూడా  అందుబాటులోకి వచ్చింది. అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలలు   సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ లో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా  కేంద్ర మంత్రిత్వ శాఖలు పనిచేస్తాయి.  

కేంద్ర సచివాలయం పని సంక్లిష్టంగా, విభిన్నంగా ఉంటుంది. దీనికోసం  సెంట్రల్ సెక్రటేరియట్ మాన్యువల్ ఆఫ్ ఆఫీస్ ప్రొసీజర్ ప్రామాణిక ప్రక్రియ, విధానాలు నిర్దేశిస్తుంది. ప్రత్యేక ప్రచారం 2.0 కార్యక్రమంలో భాగంగా  ఎలక్ట్రానిక్, భౌతిక వ్యర్థాలను తొలగించిన పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం రూ. 48,500  ఆదాయాన్ని ఆర్జించింది.   దాదాపు 200 చదరపు అడుగుల స్థలాన్ని వినియోగంలోకి తెచ్చింది.