పూజా సామగ్రి తప్ప నగదు లేని బ్యాగులతో నవ్వులపాలైన టిఆర్ఎస్  

కేసీఆర్ ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్యెల్యేల కొనుగోలుకు బేరసారాలు ఆడుతున్నారని అంటి ఎంతో ఆర్భాటంగా ఆరోపణల కురిపించిన ఆరోపణల వర్షం పసలేనివిగా వెల్లడయ్యాయి. నిందితులకు రేమండ్ ఇవ్వడానికి ఎసిబి కోర్ట్ జడ్జి తిరస్కరించడంతో పాటు అసలు అక్కడ నేరం జరిగింది అనడానికి ఎటువంటి ఆధారాలు చూపలేక పోయారని కూడా పేర్కొనడం గమనార్హం.
ఫామ్‌‌హౌస్‌‌లో గుర్తించిన టీఎస్07 హెచ్ఎమ్2777 కారు ఈ కేసులో కీలకంగా మారింది. ఎమ్మెల్యేలకు రూ.వంద కోట్లు ఇచ్చేందుకు ఫామ్‌‌హౌస్‌‌లో డీల్ జరిగిందని ప్రచారం జరుగుతుండడంతో పోలీసులు ఆధారాల కోసం సోదా సందర్భంగా  కారులో ఉన్న 3బ్యాగ్స్‌‌ను తనిఖీ చేశారు. అందులో పూజా సామగ్రి, పంచలు, గోపంచకం ఉన్నట్లు గుర్తించినట్లు తప్పా అసలు నగదు కనిపించక పోవడంతో నవ్వుల పాలయ్యారు.
అయితే కారు వివరాలు కానీ, బ్యాగ్స్‌‌లో ఏమున్నాయనే దాని గురించి కానీ పోలీసులు వెల్లడించలేదు. రూ.100 కోట్లు అంటూ రోహిత్‌‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌ మినహా డబ్బుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడా లభించలేదు. కారు గచ్చిబౌలి ఖాజాగూడకు చెందిన గండవరం దిలీప్‌‌కుమార్‌‌‌‌కు చెందినదిగా గుర్తించారు. దిలీప్‌‌కుమార్.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడని తెలిసింది.  ఇదే కారును నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి వారం రోజులుగా వినియోగిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌‌లో పూజలు, ఇతర కార్యక్రమాలకు కారును తీసుకెళ్తుండేవాడని తెలిసింది.
 
రూ.100 కోట్లు ఆఫర్‌‌‌‌ వచ్చిన రెండు నెలల తర్వాత రోహిత్‌‌రెడ్డికి ప్రలోభాలు గుర్తొచ్చాయా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముగ్గురు ఎమ్మెల్యేలను రోహిత్‌‌ రెడ్డే పిలిపించారా? లేక డీల్‌‌ సమాచారం అందడంతోనే మిగతా ముగ్గురు అక్కడికి రహస్యంగా చేరుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేసేంత పెద్ద కేసులు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదంతా ఒకెత్తు అయితే.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసుపై టీఆర్ఎస్ నేతలు అకస్మాత్తుగా ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ప్రలోభాలు, బేరసారాలు జరిగి ఉంటె ‘ఓటుకు నోటు’ కేసు మాదిరి రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా ఎందుకు పట్టుకోలేదని రాజకీయ వర్గాలలో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
 పూజల కోసం మాత్రమే ఫామ్ హౌస్ కు వెళ్లాం 
 
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదని నంద కుమార్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తమకు తెలియదన్న ఆయన సింహ యాజీ స్వామీజీతో సామ్రాజ్య లక్ష్మీ పూజ జరిపించడానికి మాత్రమే ఫామౌస్ కు వెళ్ళామని వెల్లడించారు.
 
మునుగోడు ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని ఆయన  ఆరోపించారు. ఎలాంటి సమాచారంతో సోదాలు చేశారో తమకు తెలియదని ఆయన  విస్మయం వ్యక్తం చేశారు. న్యాయాన్ని నమ్ముతున్నామన్న నంద కుమార్ న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని చెప్పారు. త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.