రూ 699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అంతర్జాతీయ ప్రమాణాలు

దేశంలోనే ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో అత్యంత ముఖ్యమైన స్టేషన్‌ లలో ఒకటైన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సుమారు రూ 699  కోట్లతో అత్యాధునిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్‌ల సుందరీకరణలో భాగంగా రైల్వేలు, రైల్వే స్టేషన్ల పునరాభివృద్దికి ప్రాధాన్యతని ఇస్తోంది.
వీటి ప్రారంభంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే తన పరిధిలోని ప్రధాన స్టేషన్ల అప్‌గ్రేడియేషన్‌ను చేపట్టడానికి గిరిధర్‌లాల్‌ కన్స్‌ట్రక్షన్‌ కంపెనీ పైవేట్‌ లిమిటెడ్‌ (న్యూ ఢిల్లి) కంపెనీకు కాంట్రాక్టును బుధవారం ఇచ్చింది. 36 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టింది. కాగా ఈ ప్రాజెక్టు అమలుకు సుమారుగా రూ. 699 కోట్లు వ్యయం కావచ్చని అంచనా వేసింది.
ఎన్‌ఎస్‌జి1 స్టేషన్‌ (నాన్‌ సబర్బన్‌ గ్రేడ్‌ – 1) విభాగంలో జోన్‌ అంతటా ఉన్న ఒకే ఒక స్టేషన్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌ కావడం గమనార్హం. రూ. 500 కోట్ల ఆదాయం లేదా సంవత్సరానికి 20 మిలియన్ల ప్రయాణికులు ఉన్న స్టేషన్లు ఎన్‌ఎస్‌జి 1 కిందకు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ స్టేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది.
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సగటున రోజుకు 200 రైళ్లను నడుపుతున్నారు. సగటున 1.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసిన రక్షణ మధ్య రైల్వే ఇందుకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, సదుపాయాలకు ప్రణాళికలు రూపొందించుకుంది.
అందులో భాగంగానే స్టేషన్‌ను పెద్ద ఎత్తున అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రతిపాదించింది. రైలు వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు ఏర్పడకుండా చూస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ కాంప్లెక్స్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలు మౌళిక వసతులు, సదుపాయాలు ఉండేలా దక్షిణ మధ్య రైల్వే ఒక మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌ అప్‌గ్రేడియేషన్‌ కింద చేపట్టిన పనులు ఇలా ఉండనున్నాయి.