మోధేరా: భారతదేశపు మొదటి 24X7 సౌరశక్తితో పనిచేసే గ్రామం

క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా ఒక ప్రధాన అడుగులో భాగంగా, సౌర దేవాలయానికి ప్రసిద్ధి చెందిన మోధేరాను భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే గ్రామంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా, 1000కి పైగా సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు.

గ్రామస్తులకు 24 గంటలూ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఇళ్లపై. వారికి జీరో ఖర్చుతో సౌర విద్యుత్‌ను అందించడం గమనార్హం. సూర్య దేవాలయ పట్టణాన్ని సౌరశక్తికి తీసుకురావాలనే మోదీ దార్శనికతను నిదర్శనంగా ఈ రకమైన మొదటి ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. 

“క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే ప్రధాన మంత్రి దార్శనికతను నెరవేర్చడంలో గుజరాత్ మరోసారి ముందంజ వేసినందుకు నేను సంతోషిస్తున్నాను. 2030 నాటికి భారతదేశ ఇంధన అవసరాలలో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా ఉత్పత్తి చేయాలన్న ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.

ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రౌండ్-మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ నివాస, ప్రభుత్వ భవనాలపై 1,300 కంటే ఎక్కువ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను అభివృద్ధి చేశారు. సూర్యదేవాలయంకు 6 కి.మీ దూరంలో అన్నింటిని బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థతో (బిఇఎస్ఎస్) ఏకీకృతం చేశారు.  భారతదేశ పునరుత్పాదక ఇంధన శక్తి అట్టడుగు స్థాయి ప్రజలను ఎలా శక్తివంతం చేస్తుందో ఇది తెలియజేస్తుందని ఓ అధికారిక  ప్రకటన పేర్కొంది.

ఈ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా మోధేరా సూర్య దేవాలయం, పట్టణంలకు  సౌరశక్తిని అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఈ ప్రాజెక్ట్ చేపట్టాయి.  ఈ ప్రాజెక్టు అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం 12 హెక్టార్ల భూమిని కేటాయించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు దశల్లో 50:50 చొప్పున రూ.80.66 కోట్లు ఖర్చు చేశాయి. మొదటి దశలో రూ.69 కోట్లు, రెండో దశలో రూ.11.66 కోట్లు కేటాయించారు.

సోలార్ ఆధారిత అల్ట్రా-మోడర్న్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ను కలిగి ఉన్న మొదటి ఆధునిక గ్రామం ఇది కానున్నది.  భారతదేశంలో మొట్టమొదటి గ్రిడ్-కనెక్ట్ చేయబడిన మెగావాట్-అవర్స్ స్కేల్ బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ ఏర్పడుతున్నది. దీనితో మొధేరాలోని ప్రజలు విద్యుత్ బిల్లులపై 60% నుండి 100% వరకు ఆదా చేస్తారు.

సూర్య దేవాలయం వద్ద హెరిటేజ్ లైటింగ్ , 3-డి ప్రొజెక్షన్ సౌరశక్తితో పనిచేస్తాయి. 3-డి ప్రొజెక్షన్ సందర్శకులకు మోధేరా చరిత్ర గురించి తెలియజేస్తుంది. ఆలయ ప్రాంగణంలో హెరిటేజ్ లైట్లను ఏర్పాటు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, బెచరాజి తాలూకాలోని మోధేరా గ్రామంలో 6,373 మంది జనాభా ఉన్నారు.

“సౌర విద్యుత్ వినియోగం ఇప్పటికే పౌరులకు ప్రయోజనాలు కలిగిస్తున్నది. రూ. 1,000 కంటే ఎక్కువ ఉన్న విద్యుత్ బిల్లులు నేడు దాదాపు సున్నాకి తగ్గాయి. సాధ్యమయ్యే అన్ని ఇళ్లలో సౌర ఫలకాలను ఉచితంగా అమర్చారు. అదనపు ఇంధనం విషయంలో, మేము కూడా అదనపు ఆదాయాన్ని పొందుతాము,” అని మొధేరా సర్పంచ్ జతన్‌బెన్ ఠాకోర్ తెలిపారు.