అమెరికాలో భారతీయుల కిడ్నాప్ కథ విషాదాంతం

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులకు రక్షణ లేకుండా పోయింది. కిడ్నాప్ కు గురైన నలుగురు భారతీయుల కథ విషాదాంతమైంది. కాలిఫోర్నియాలోని మెర్సిడ్ నగరంలో కిడ్నాప్ కు గురైన 8 నెలల చిన్నారి సహా భారత సంతతికి చెందిన నలుగురు సభ్యులు ఓ తోటలో విగతజీవులుగా కనిపించారు. 

మెర్సిడ్ కౌంటీ లోని ఓ పండ్ల తోటలో మృతదేహాలు కనిపించాయని పోలీసు ఉన్నతాధికారి వెర్న్ వార్క్నే తెలిపారు. ఉత్తర కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుంచి  సోమవారం 8 నెలల చిన్నారి అరహిధేరి, ఆమె తల్లి జస్లీన్ కౌర్ (27),తండ్రి జస్దీప్ సింగ్ (36), మేనమామను దుండగులు కిడ్నాప్ చేశారు.

అదే రోజు కుటుంబ సభ్యుల్లో ఒకరికి చెందిన కారును కాల్చివేశారు. ఈ విషయం తెలియగానే పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే బాధితుడి బ్యాంకు కార్డులలో ఒకటి మెర్సిడ్ కౌంటీలోని అట్ వాటర్ ఏరియాలోని ఒక ఏటీఎం సెంటర్ లో ఉపయోగించినట్లు వెల్లడైంది.  

 కిడ్నాప్ అయిన వారిలో 8 నెల‌ల చిన్నారి ఆరూహి ధేరితో పాటు ఆమె పేరెంట్స్ జ‌స్లీన్ కౌర్‌, జ‌స్‌దీప్ సింగ్‌, అమ‌న్‌దీప్ సింగ్ ఉన్నారు. నార్త్ కాలిఫోర్నియాలోని మెర్సెడ్ కౌంటీలో ఉన్న ఓ బిజినెస్ సెంట‌ర్ నుంచి ఆ న‌లుగుర్నీ కిడ్నాప్ చేశారు.

ఇండియానా రోడ్‌, హ‌ట్చిన్‌స‌న్ రోడ్ స‌మీపంలో ఉన్న ఓ తోట‌లో ఆ న‌లుగురి మృత‌దేహాలు ల‌భ్య‌మైన‌ట్లు మెర్సిడ్ కౌంటీ పోలీసు ష‌రీఫ్ వెర్న్ వార్న‌కీ తెలిపారు. ఆ ఫామ్‌లో ప‌నిచేస్తున్న ఓ వ‌ర్క‌ర్ మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు పోలీసులు చెప్పారు. బుధ‌వారం రోజున కిడ్నాప్‌కు సంబంధించిన వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు.

బిజినెస్ సెంట‌ర్ నుంచి జ‌స్‌దీప్‌, అమ‌న్‌దీప్‌లు చేతులు క‌ట్టేసి కిడ్నాప‌ర్లు తీసుకువ‌చ్చారు. కొన్ని సెక‌న్ల త‌ర్వాత చిన్నారి అరూహితో పాటు ఆమె త‌ల్లిని కూడా బిల్డింగ్ నుంచి వ‌చ్చారు. ఫ్యామిలీకి చెందిన న‌లుగుర్ని ఓ ట్ర‌క్కులో ఎక్కించి తీసుకువెళ్లారు. ఎన్ఆర్ఐ ఫ్యామిలీ కిడ్నాప్ అయిన ఒక రోజు త‌ర్వాత జీసెస్ మాన్యువ‌ల్ సాల్గ‌డోను క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. నేరానికి పాల్ప‌డిన‌ట్లు సాల్గ‌డో త‌మ కుటుంబానికి చెప్పిన‌ట్లు పోలీసులు తెలిపారు.