కేంద్ర బలగాల పర్యవేక్షణలో మునుగోడు ఎన్నిక నిర్వహించండి

కేంద్ర బలగాల పర్యవేక్షణలో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలని పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికా్‌సరాజ్‌ను కోరింది. మంగళవారం బీజేపీ నాయకుడు ఇంద్రసేనా రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు వికాస్​రాజ్​ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. 
 
దుబ్బాక, హుజూరాబాద్​ బై ఎలక్షన్​ సందర్భంగా కేంద్ర బలగాలు పంపినట్లే మునుగోడుకు పంపాలని, ప్రత్యేక పోలీసు అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో స్థానిక పోలీసు అధికారులు టీఆర్‌ఎ్‌సకు వత్తాసు పలుకుతున్నందున ఉప ఎన్నిక పారదర్శకంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరమని తెలిపారు.
 
దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓడిపోవడంతో ఇక్కడ గెలిచేందుకు అధికార పార్టీ విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తోందని, పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించింది. దుబ్బాక, హుజూరాబాద్‌లాగే మునుగోడులో కూడా ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. 
 
 సీఐ అంతకంటే తక్కువ ర్యాంకు ఉన్న పోలీసు ఆఫీసర్లంతా బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీస్ అధికారులు పక్షపాతంతో, ఏకపక్షంగా, అధికార పక్షంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పైగా, బిజెపి అభ్యర్ధికి,  బిజెపి కార్యకర్తలకు ప్రాణ హాని కలిగే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
షెడ్యూల్​ రాకముందు నుంచే నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని చెబుతూ వాహనాల తనిఖీలో భాగంగా అంబులెన్స్ లను చెక్ చేయాలని కోరారు. కొత్త ఓటర్లలను ఇప్పుడు నమోదు చేసుకోవద్దని కోరారు.  8న ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తామని సీఈవో చెప్పినట్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు.