పిఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని బీమతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పిఎఫ్ఐ చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

దేశంలో కల్లోలం సృష్టించేందుకు అక్రమ మార్గాల్లో నిధులు సేకరిస్తూ ఆధారాలతో సహా దొరికిపోయిన పిఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని టిఆర్ఎస్ సయామి  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని జేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు.
తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి తప్ప, మొత్తం సంస్థపై నిషేధాన్ని తాను సమర్ధించలేనంటున్నరని ఆమె ఎద్దేవా చేశారు. 
 
పిఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు యూపీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దొరికిన ఆధారాల మేరకు ఈ సంస్థను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి సిఫార్సు చేశాయని ఆమె గుర్తు చేశారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పిఎఫ్ఐ చేస్తున్న తప్పులు, అక్రమాలు ఈ రాష్ట్రాలకే పరిమితం కాలేదని, పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆధారాలు దొరికాయని ఆమె తెలిపారు. 
 
 అలాంటప్పుడు దేశవ్యాప్తంగా నిషేధించక ఏం చెయ్యాలి?  అని విజయశాంతి ప్రశ్నించారు. పైగా తాను ఎప్పుడూ పిఎఫ్ఐ విధానాలను వ్యతిరేకిస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చిన ఓవైసీ గారు, ఇప్పుడిలా మాట్లాడటం రెండు నాల్కల ధోరణి గాక ఇంకేంటి? అని ఆమె నిలదీశారు. అసలు ఓవైసీ గారు నాయకత్వం వహిస్తున్న ఎంఐఎం కూడా ప్రధాని నెహ్రూ హయాంలో దేశవ్యాప్తంగా నిషేధానికి గురైన సంగతి ఆయనకి తెలీదా? అని గుర్తు చేశారు. 
 
అప్పట్లో కేవలం వ్యక్తుల మీద గాక మొత్తం ఎంఐఎం పార్టీనే నిషేధించారని ఆమె చెప్పారు. నాటి ఎంఐఎం విధానాలు, పద్ధతులు మారినట్లు అనిపించిన ప్రవర్తన చూపిన తర్వాతే నిషేధం తొలగించారని ఆమె తెలిపారు. ఇదంతా తెలిసి కూడా అసదుద్దీన్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఆయన అపరిపక్వ వైఖరిని సూచిస్తోందని ఆమె విమర్శించారు.