సూరత్ ఓ బుల్లి భారత దేశం వంటిది … ప్రధాని కితాబు

ప్రజల సంఘీభావానికి, సార్వజనిక భాగస్వామ్యాని కి సూరత్ నగరం ఒక అపురూపమైనటువంటి ఉదాహరణగా ఉందని పేర్కొంటూ ‘‘సూరత్ నేల మీద నివసించని వ్యక్తులు భారతదేశంలో ఏ ప్రాంతం లోనూ ఉండరు; ఇది ఓ బుల్లి భారతదేశం వంటిది’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు.
రూ. 3,400 కోట్లకు పైగా విలువ కలిగిన వివిధ ప్రాజెక్టుల కు సూరత్ లో  శంకుస్థాపన చేయడంతో పాటుగా ఆయా ప్రాజెక్టుల ను దేశ ప్రజలకు అంకితం చేశారు. రహదారి మౌలిక సదుపాయాల ఒకటో దశ పనులు, డాయమండ్ రిసర్చ్ ఎండ్ మర్కంటైల్ (డిఆర్ఇఎఎమ్- డ్రీమ్) సిటీ  ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు తాలూకు రెండో దశ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. దీనికి తోడు, భీమ్ రాడ్ – బమ్ రోలీ వంతెన, డాక్టర్ హెడ్గేవార్ వంతెనల మధ్యన ఉన్నటువంటి 87 హెక్టార్ల ప్రాంతం లో నిర్మిస్తున్న బయోడైవర్సిటీ పార్కు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. సూరత్ లో గల సైన్స్ సెంటర్ లో ఖోజ్ మ్యూజియాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ఈ శతాబ్దంలోని తొలి దశాబ్దుల లో ‘3 పి’ లను గురించి ప్రపంచంలో చర్చించడం జరిగిందని గుర్తు చేస్తూ, ఆ మూడు పబ్లిక్, ప్రైవేటు, భాగస్వామ్యంలు అని వివరించారు. అయితే, సూరత్ ‘4 పి’ లకు ఒక దృష్టాంతంగా నిలచిందని చెబుతూ ‘‘ఆ ‘4 పి’ లు ఏవేవి అంటే పీపల్ (ప్రజలు), పబ్లిక్, ప్రైవేట్, పార్ట్ నర్ శిప్ లే అని ఆయన చెప్పారు. ఈ నమూనా సూరత్ ను ప్రత్యేకమైందిగా దిద్దితీర్చిందని తెలిపారు.

ప్రస్తుతం, ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల సరసన సూరత్ స్థానాన్ని సంపాదించుకొందని చెబుతూ ఇది అంటువ్యాధులకు, వరదలకు ఈ నగరం మారుపేరు అనేటటువంటి అపఖ్యాతిని తెచ్చుకొన్న కాలం కంటే చాలా భిన్నమైందని ప్రధాని చెప్పారు.

డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒనగూరిన సకారాత్మక ప్రభావాలను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, సూరత్ లో పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ళ నిర్మాణం, ఇతర సదుపాయాలు చెప్పుకోదగినంతగా పెరిగాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అందిన లాభాలను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, దేశం లో ఇంతవరకు సుమారు 40 మిలియన్ పేద రోగులు ఈ పథకంలో ఉచిత చికిత్స ను అందుకొన్నారని పేర్కొన్నారు.

‘‘వారిలో గుజరాత్ నుండి 32 లక్షల మందికి పైగా రోగులు ఉన్నారు, అందులో సూరత్ నుండే దాదాపుగా 1.25 లక్షల మంది ఉన్నారు’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. సూరత్ లో వస్త్రాల వ్యాపారాన్ని గురించి మరియు వజ్రాల వ్యాపారాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది దేశం అంతటా అనేక కుటుంబాల మనుగడకు ఊతంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.

డ్రీమ్ సిటీ ప్రాజెక్టు పూర్తి అయింది అంటే గనక సూరత్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైనటువంటి, అత్యధిక సౌకర్యవంతం అయినటువంటి వజ్రాల వ్యాపార కేంద్రాలలో ఒకటిగా అభివృద్ధి చెందుతుందని మోదీ భరోసా వ్యక్తం చేశారు.

సూరత్ కు ఆదిలో వజ్రాల నగరం అనే గుర్తింపు ఉండగా, తరువాత అది కాస్తా వంతెనల నగరం గా మారిందని, ప్రస్తుతం విద్యుత్తు వాహనాల నగరం అనే సరికొత్త గుర్తింపు లభిస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు. నగరంలో విద్యుత్తు వాహనాలు పెద్ద సంఖ్య లో కనిపిస్తూ ఉండడం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, సూరత్ అతి త్వరలోనే విద్యుత్తు వాహనాలకు కూడాను ప్రసిద్ధి చెందుతుందని చెప్పారు.

సూరత్ లో గత రెండు దశాబ్దాల లో అభివృద్ధి శరవేగంగా చోటు చోటుచేసుకుందని చెబుతూ, ఈ అభివృద్ధి వేగం రాబోయే సంవత్సరాల లో మరింత పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.