ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో మంగళవారం జరిగిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఒక అసాధారణ దృశ్యం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాను కూర్చునే కుర్చీని మహా శివుడి చిత్రపటానికి అర్పించి తాను వేరే కుర్చీలో కూర్చుని మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు.
క్యాబినెట్ సమావేశం జరిగినపుడు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న టేబుల్ మధ్యలో ఉండే కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీలో మహా శివుడి భారీ చిత్రపటం ప్రత్యక్షమైంది.
మధ్యప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఉజ్జయినిలో జరిగింది. టేబుల్‌కు చెరో చివర ముఖ్యమంత్రి చౌహాన్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఇక్బాల్ ఎస్ బైన్స్ ఆశీనులయ్యారు.
ఈ క్యాబినెట్ సమావేశంలో కొత్తగా నిర్మించిన మహాకాళేశ్వర్ ఆలయ కారిడార్‌కు మహాకాళ్ లోక్‌గా నామకరణ చేయాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో రూ. 856 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మహాకాళేశ్వర్ ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 11న ప్రారంభించనున్నారు. 2023 నవంబర్‌లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉంది.
More Stories
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి
ఎస్ఎం కృష్ణ మృతిపట్ల ప్రధాని, చంద్రబాబు సంతాపం
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?