చెత్తపై కూడా పన్నులేసి దోచుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఈయన కళ్లకు పేదలు అసలే కనిపించరని, వారి సంక్షేమం అసలే పట్టదని ఆయన మండిపడ్డానారు. గతంలో ఇసుక మాఫియా చెలరేగిపోయిందని వీధివీధి తిరిగి ప్రచారం చేసిన జగన్ .అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుందేంటో చెప్పాలని నిలదీశారు.
జగన్ పాలనలో ప్రజలు బతకలేని పరిస్థితి ఉందని పేర్కొంటూ ఆయన అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించాలని కన్నా పిలుపిచ్చారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని తెలిపారు. కడప పాలకులు (జగన్) ఈ ప్రాంతానికి (ఉత్తరాంధ్ర) వస్తే ఇక్కడి ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని కన్నా హెచ్చరించారు.
ఇసుకలో అవినీతి జరుగుతున్నదని తెలుసుకోవడానికి సీఎంకు ఆర్నెళ్ల సమయం పట్టిందని, ఈ ఆర్నెళ్ల పాటు భవన నిర్మాణ కార్మికులు దాదాపు 50 లక్షల మంది బజారున పడ్డా పట్టించుకోలేదని కన్నా విమర్శించారు. రాష్ట్ర సంపదనంతా ఏకీకృతం చేసి దోచుకుంటున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. దేశంలోనే అంత్యంత ధనవంతుడు కావాలనేది జగన్ లక్ష్యమని చెప్పారు. .
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను గాలికొదిలేసిన జగన్ రాజధాని ఏర్పాటు అంశంతో మూడు ముక్కలాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించడం చేతకాకపోతే తప్పుకోవాలని, తామే ప్రాజెక్టును నిర్మిస్తామని కన్నా స్పష్టం చేశారు.
ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని, ఇప్పుడు ఉపాధి కూడా కరవైన పరిస్థితులు ఉన్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసిన కన్నా లక్ష్మీనారాయణ డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు..

More Stories
పరకామణిలో చోరీ కేసుబలహీనపర్చారు
‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి
పోలవరం ప్రాజెక్టులో 87 శాతం సివిల్ పనులుపూర్తి