టి20 సిరీస్‌ భారత్ కైవసం

 
ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మూడో నిర్ణయాత్మక టీ20లో భారత్ అదరగొట్టింది. హైదరాబాద్ వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో అదుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆసీస్‌ను నిర్దేశించిన లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.
 
దానితో  మూడేండ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్‌ జరుగుతుండటంతో తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకు పరుగుల పండుగ కనువిందు చేసింది. ఆసీస్‌పై బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పూర్తిగా రాణించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ విధించిన 187 లక్ష్యాన్ని ఇంకా ఒక బంతి మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల మాత్రమే కోల్పోయి అందుకుంది.
 
రాహుల్‌, రోహిత్‌ శర్మ నిరాశ పర్చినా సూర్య కుమార్‌ యాదవ్‌ 69 పరుగులు (36 బంతుల్లో ఐదు సిక్స్‌లు, ఐదు ఫోర్లు), కోహ్లి 63 పరుగులు (48 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, మూడు ఫోర్లు) చేయగా, హర్థిక పాండ్యా 25 పరుగులు (16 బంతుల్లో సిక్స్‌, రెండు ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు.
 
ఈ విజయంతో భారత్‌ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఇక, దక్షిణాఫ్రికాతో ఈ నెల 28 నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొననుంది.  సూర్య, కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్‌తో కంగారూలను హడలెత్తించారు.  ఆసీస్ బ్యాటర్లు టేగీన్, టిమ్ డేవిడ్ అర్ధశతకాలు సాధించినా ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు.
 
టాస్‌ నెగ్గడంతోనే భారత్‌ సగం మ్యాచ్‌ గెలిచేయగ, మిగిలిన పని ప్లేయర్లు పూర్తి చేశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో టీమ్‌ఇండియా 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా 2-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది.
 
ఓపెనర్‌ కామెరున్‌ గ్రీన్‌ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. కెప్టెన్‌ ఫించ్‌ (7), స్టీవ్‌ స్మిత్‌ (9), మ్యాక్స్‌వెల్‌ (6), వేడ్‌ (1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్‌, చాహల్‌, హర్షల్‌ పటేల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.
 
 పాయింట్‌లో సులువైన క్యాచ్‌ వదిలేసిన అక్షర్‌ పటేల్‌.. విద్వంసక ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను బౌండ్రీ నుంచి డెరెక్ట్‌త్రోతో రనౌట్‌ చేయడం విశేషం. ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా నాలుగు ఓవర్లలో వికెట్‌ లేకుండా 50 పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది.
 
 సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచి కొట్టగా.. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఉప్పల్‌లో తన హవా కొనసాగించాడు. ఆఖర్లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (16 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.
 
ఆసీస్‌ బౌలర్లలో సమ్స్‌ రెండు హజిల్‌వుడ్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, అక్షర్‌ పటేల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’అవార్డులు దక్కాయి.  ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీం ఇండియాకు సిఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో సిరీస్ కైవసం చేసుకోవ డంపై హర్షం వ్యక్తం చేశారు. మ్యాచ్ రోజున ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన క్రీడాశాఖ మంత్రి, పోలీస్ అధికారులు, సిబ్బందిని సిఎం కేసీఆర్ అభినందించారు.