దాండియా నృత్యాలకు అన్యమతస్థులను రానీయొద్దు

దసరా శరన్నవరాత్రుల వేడుకల సందర్భంగా నిర్వహించే దాండియా నృత్యాలలో అన్యమతస్తుల ప్రవేశాన్ని గమనించాలని తెలంగాణ రాష్ట్ర దుర్గా వాహిని కన్వీనర్ వాణీ సక్కుబాయి హెచ్చరించారు. ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలయిన దాండియా వంటి వేడుకల్లో హిందూ యువకుల రూపంలో అన్యమతానికి చెందిన యువకులు వచ్చి హిందూ యువతులను లవ్ జిహాద్ పేరుతో వలలో వేసుకుంటూ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
 
దాండియా వేడుకల నిర్వాహకులు రక్షణ వ్యవస్థల్లో కేవలం హిందూ యువకులు మాత్రమే ఉండేలా చూడాలని స్పష్టం చేస్తూ సహాయం కోసం బజరంగ్ దల్ రక్షణగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల గుర్తింపు కార్డులను చూసి లోనికి అనుమతించాలని ఆమె సూచించారు.
 
దాండియా నృత్యాలలో ఆధార్ కార్డులు వెరిఫికేషన్ చేసి, బౌన్సర్లను ఉంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ దల్ కన్వీనర్ శివ రాములు సూచించారు. ఎక్కడైనా రక్షణ కావాలంటే బజరంగ్ దళ్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాలలో కూడా హిందూ యువతులను టార్గెట్ చేస్తూ ముస్లింలు టీజింగ్ చేశారని గుర్తు చేశారు.
 
తక్షణమే పిఎఫ్ఐని నిషేధించాలి

 
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్రలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బయట పెట్టడం పట్ల విశ్వ హిందూ పరిషత్  కొనియాడింది. పరిషద్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కార్యదర్శి పండరినాథ్ మీడియాతోమాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలను ప్రథమ పౌరులుగా భావిస్తూ, హిందువులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే పిఎఫ్ఐపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ దాడులు జరిగినా, వాటి మూలాలు హైదరాబాద్ లో బయట పడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంతుష్టీకరణలో భాగంగా ఉదాసీనంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
 
 ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొంటూ దీని ద్వారా ఒక హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.