మైనార్టీల ర‌క్ష‌ణ గురించి పాక్ మాట్లాడ‌డమా… భారత్ ఎద్దేవా

స్వ‌దేశంలో మైనార్టీల‌ను ప‌ట్టించుకోని పాకిస్థాన్‌.. ప్ర‌పంచ స్థాయిలో మైనార్టీల ర‌క్ష‌ణ గురించి మాట్లాడ‌డం విడ్డూర‌మ‌ని భారత్ ఎద్దేవా చేసింది. ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశాల్లో పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను యూఎన్‌లోని ఇండియ‌న్ మిష‌న్ కార్య‌ద‌ర్శి మిజిటో వినిటోతిప్పి కొడుతూ క‌శ్మీర్‌పై పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు తెలిపారు.
 
శుక్రవారం యుఎన్‌జిఎ ప్రసంగాల ముగింపు తర్వాత ‘రైట్ ఆఫ్ రిప్లై’ సెషన్‌లో భారత దౌత్యవేత్త మిజితో వినిటో మాట్లాడుతూ, “తన సొంత దేశంలో తమ దుశ్చర్యలను కప్పిపుచ్చడం కోసం భారతదేశానికి వ్యతిరేకంగా ప్రపంచం ఆమోదయోగ్యంగా లేని చర్యలను సమర్థించడానికి ఆయన ఆ విధంగా మాట్లాడారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
“తన పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నట్లు చెప్పుకునే రాజకీయాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎప్పటికీ స్పాన్సర్ చేయవు. లేదా అది అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో మాత్రమే ఉనికిని బహిర్గతం చేస్తూ భయంకరమైన ముంబై ఉగ్రవాద దాడికి ఆశ్రయమివ్వదు,” అని  వినిటో తన సమాధానంలో స్పష్టం చేస్తూ “అటువంటి దేశం పొరుగువారిపై అన్యాయమైన, సమర్థించలేని ప్రాదేశిక వాదనలు చేయదు” అంటూ విమర్శించారు. 
 
పాక్ సీమాంత‌ర ఉగ్ర‌వాదానికి పాల్ప‌డుతున్న‌ట్లు మిజిటో ఆరోపించారు. భార‌త్‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసేందుకు యూఎన్‌ను పాక్ ప్ర‌ధాని వేదిక‌గా చేసుకోవ‌డం స‌రైన విధానం కాద‌ని స్పష్టం చేశారు. స్వ‌దేశంలో ఉన్న స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ఆయ‌న ఇలా చేశార‌ని వినిటో ఆరోపించారు.
దావూద్ ఇబ్ర‌హీం గురించి ప్ర‌స్తావించిన భార‌త్‌  శాంతి కావాల‌ని ఆశిస్తున్న దేశం.. ఎన్న‌టికీ 1993 బాంబు పేలుళ్ల నిందితుల‌కు ఆశ్ర‌యాన్ని ఇవ్వ‌ద‌ని స్పష్టం చేశారు. పాక్‌తో భార‌త్ స్నేహ‌పూర్వ‌క సంబంధాల్ని కోరుతున్న‌ట్లు వినిటో చెబుతూ ఉగ్ర‌వాదం, ద్వేషం, హింస వద్దని పొరుగు దేశానికి హితవు చెప్పారు.