ఆదివాసీ విద్యార్థుల చికిత్స బాధ్యత ప్రభుత్వానిదే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ హాస్టళ్లు, వస్తాయి గృహాలు,  పాఠశాలలలో అనారోగ్యానికి గురైన ఆదివాసి విద్యార్థుల చికిత్స బాధ్యత పూర్తిగా  సంబంధిత ప్రిన్సిపాల్/ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్/ వార్డెన్ /ఎఎన్ఎం లు చూసేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశించిన వలసిందిగా కోరుతూ జాతీయ మానవ హక్కుల కమీషన్ (ఎన్ హెచ్ ఆర్ సి)కు హ్యూమన్ రైట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాలు అక్కిసా ఫిర్యాదు చేశారు,
 
వ్యాధులకు గురైన విద్యార్థి సంబంధిత హాస్టల్ సిబ్బంది చర్యలు తీసుకోకుండా, చికిత్స చేయించకుండా ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు ఆప్పచెప్పుచున్నారని రంపచోడవరం కేంద్రంగా పనిచేస్తున్న ఈ హక్కుల ఉద్యమ నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. అలా విద్యార్థు లు వ్యాధితో తమ ఊరికి వెళ్లిన తర్వాత సరైన వైద్య సదుపాయాలు లేక విద్యార్థుల మరణించడం జరుగుచున్నదని చెప్పారు.
 
దీనిపై స్టాండర్డ్గా ప్రోటోకాల్ నిర్దేశించ వలసినదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్ హెచ్ ఆర్ సి ఆయన కోరారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం, మారేడుమిల్లి ఏపీ ఆర్ లో మరణించిన ఆదివాసీ విద్యార్థి సదాల లోకేష్ రెడ్డి విషయం కూడా ఇదే కోవకు చెందినదని పేర్కొన్నారు.
 
లోకేష్ రెడ్డి కి ఆరోగ్యం క్షీణించింది మారేడుమిల్లి వైద్య సదుపాయం లేకపోవడంతో,  రంపచోడవరం ఏరియాసుపత్రి కి తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేయమని ఆసుపత్రి వర్గాలు చెప్తే దీనికి భిన్నంగా ప్రిన్సిపాల్/వార్డెన్   విద్యార్థిని తండ్రికి అప్పచెప్పి ఇంటికి పంపించారని చెప్పారు. దానితో అక్కడ తగు  వైద్యం అందక ఇంటికి వెళ్ళిన తర్వాత విద్యార్థి మరణించాడని వివరించారు.
 
గత సంవత్సరంలో కూడా అదే పాఠశాలలో అకాల మరణం సంభవించిన్నప్పుడు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోవడం వలన ఈ సంవత్సరం రెండవ మరణానికి దారితీసిందని బాలు చెప్పారు. ఆ కుర్రాడికి వచ్చిన వ్యాధులు తెలిసి కూడా  తండ్రికి అప్పజెప్పడం నిబంధనలకు విరుద్ధం అని స్పష్టం చేశారు.
 
ఇది ఇలా ఉండగా ఆగష్టు 28, 2011న  పెద్ద గెద్దాడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్లో చదువుతున్న ఆదివాసీ విద్యార్థి జ్వరం రాగా హాస్పిటల్లో చికిత్స చేయించకుండా ఆ విద్యార్థులు ఇంటికి పంపిస్తే ఇంటి దగ్గర మరణించిన్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆ విద్యార్థి తల్లిదండ్రులతో కొత్తబట్టలు కొనుక్కోవటానికి ఇంటికి వెళ్ళాడని చెప్పారని తెలిపారు.
 
అయితే,  ఆ కుర్రవాడికి మూడు రోజులు చికిత్స చేసినట్ గ్రేడ్డాడా హాస్పిటల్ రికార్డ్స్ స్పష్టం చేస్తున్నట్లు సమాచార హక్కు ద్వారా వెల్లడైనదని బాలు చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు సమస్య నుండి తాత్కాలికంగా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప శాశ్వతంగా మరణాలు నివారించడానికి చర్యలు తీసుకోవడం లేదని బాలు ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఇది ఒక్కటే కాదని, ఈ విధంగా  అనేక మరణాలు సంభవించు చున్నాయని, అందుకు అధికారులు విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యమే కారణం అని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా తరచూ గిరిజన విద్యార్థులు అనారోగ్యంతో మృతి చెందడంపై అధ్యయనం జరిపి, వారి హక్కుల పరిరక్షణకు ప్రోటోకాల్ నిర్ధేశించాలని ఆయన జాతీయ మానవహక్కుల కమీషన్ ను కోరారు.