సమాలోచనలు, చర్చలు, సంప్రదింపులు పాలనకు కీలకం

సమాలోచనలు, చర్చలు, సంప్రదింపులు పరిపాలనకు కీలకం అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ స్పష్టం చేశారు. గౌహతిలో ప్రజాప్రవాహ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లోకమంతన్ 3వ ఎడిషన్‌ను శుక్రవారం ప్రారంభిస్తూ ముఖ్యంగా చట్టసభలలో ఈ విషయమై నెలకొన్న సమకాలీన దృశ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఒకప్పుడు ఉనికిలో ఉన్న చర్చలు, సంప్రదింపుల పక్రియను పునరుద్ధరింప చేయాలని ఆయన సూచించారు. ఇతరుల అభిప్రాయాల పట్ల అసహనం అనేది శక్తివంతమైన సంస్కృతికి విరుద్ధమని ఆయన హెచ్చరించాడు. మీడియా సానుకూల ప్రసంగాలను ప్రోత్సహించాలని, చిన్నవిషయాలను సంచలనం చేయవద్దని ఉపరాష్ట్రపతి హితవు చెప్పారు.
 
మన సుసంపన్నమైన గతం నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా మొత్తం పర్యావరణ వ్యవస్థ ఉద్ధరణను ప్రభావితం చేయవచ్చని ఆయన తెలిపారు.  చర్చలు, సంప్రదింపులకు ఆవశ్యకతను అందుకు ఎదురవుతున్న అనేక ప్రమాదాల నుండి కాపాడుకోవాలని ధన్‌ఖర్ పిలుపిచ్చారు. టెలివిజన్, సిసిల మీడియాలలో ప్రజల దృష్టిలో పడటం కోసం నిత్యం జరుగుతున్న ప్రయత్నాలు వాటిని పోరాట వేదికలుగా మారుస్తున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
ఈ విషయంలో మీడియా ఇక్కడ చొరవ తీసుకోవాలని, తమ పాత్రపై వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూతీసుకోవాలని, తమ పాత్రపై వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. విలక్షణమైన,  అసలైన, అట్టడుగున ఉన్న వర్గాల వారి స్వరాలు ప్రధాన స్రవంతిలోకి వచ్చేవిధంగా చూడాలని ఆయన కోరారు.
 
అస్సాం గవర్నర్ ప్రొఫెసర్ జగదీష్ ముఖి మాట్లాడుతూ  లోక్ మంథన్ అనేది మన దేశంలోని వివిధ ప్రాంతాలలో దాగి ఉన్న సాంస్కృతిక,సాంప్రదాయ సంపదనుఅన్వేషించడానికి, తిరిగి కనుగొనే ప్రయాణం అని తెలిపారు. భారతదేశాన్ని ఒక దేశంగా మార్చడానికి మన కీర్తిని తిరిగి పొందడంలో మనకు మార్గనిర్దేశం చేసేందుకు ఇక్కడ జరిగే చర్చలు, సమాలోచనలు ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి సహాయపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
 
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ భారత్ 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏర్పడిన దేశం కాదని, 5000 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న నాగరికత అని స్పష్టం చేశారు. ఉదారవాదులు, లౌకికవాదులు అని పిలవబడే వారు ఈ గొప్ప దేశం  సంస్కృతి, వారసత్వం, సంప్రదాయంలపై సంవత్సరాలుగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
 
భారతీయులమైన మనం వారికి మేధోపరంగా, సాంస్కృతికంగా సమాధానమివ్వాలని స్పష్టం చేశారు.  భారతదేశం రాష్ట్రాల యూనియన్ కాదని, ఇది సజీవ దేవత, మన సజీవ మాతృభూమి అని వారికి అర్థం అయ్యేటట్లు చూడాలని సూచించారు.  భారతవర్ష అనేది 19వ శతాబ్దంలో ఏర్పడిన జాతీయ రాజ్యమే కాదని,  ఒక జీవనాధారం అని శర్మ తెలిపారు.
 
ఈశాన్య ప్రాంతం గొప్ప ప్రాచీన భారతీయ నాగరికతను లోతుగా సుసంపన్నం చేసిందని చెప్పారు. 15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వైష్ణవ సన్యాసి మహాపురుష్ శ్రీమంత శంకర్‌దేవ్ భరతవర్షను అస్సాంతో అనుబంధించి, దానిని “మాతృభూమి”గా సూచించిన మొదటి వారని గుర్తు చేశారు.
 
 రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్  కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే, సహా సర్ కార్యవాహ  డా. మన్మోహన్ వైద్య, ప్రజ్ఞా ప్రవాహ్ జాతీయ సమన్వయకర్త జె నందకుమార్ లతో పాటు దేశంలోని అనేక మంది ప్రముఖ సాంస్కృతిక,  మేధావి ప్రముఖులు లోక్‌మంతన్ 2022 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
 లోకమంతన్ మూడవ ఎడిషన్ మన దేశంలోని వివిధ మూలల్లో ముఖ్యంగా భారతదేశంలోని ఈశాన్య భాగంలో దాగి ఉన్న సాంస్కృతిక,సాంప్రదాయ వారసత్వాలను అన్వేషించే ప్రధాన అంశంతో నిర్వహిస్తున్నారు.  లోకమంతన్ ద్వారా మన దేశంలోని మరుగున పడిన సంప్రదాయం, సాంస్కృతిక సంపదను పునరుజ్జీవింపజేసేందుకు మూడు రోజులపాటుగౌహతిలోని శంకర్‌దేవ్ కళాక్షేత్ర వేదికలో జరిగే మేధో,సాంస్కృతిక మేధోమథనంలో పలు అంశాలపై సమాలోచనలు జరుగనున్నాయి.