కరాటే క్లాసుల ముసుగులో పిఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలు.. నలుగురు అరెస్ట్

కరాటే క్లాసుల ముసుగులో యువతను చేరదీసి, వారిలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, వాటిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకొంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కొద్దీ కాలంగా కార్యకలాపాలు జరుపుతున్నట్లు జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఎ) ఆదివారం జరిపిన దాడులలో తేటతెల్లమైంది.
 
యువతకు కరాటే శిక్షణ, లీగల్ అవేర్‌నెస్ ముసుగులో పిఎఫ్‌ఐ మతకలహాలను సృష్టిస్తోందని తెలుగు రాష్ట్రాలలో 26మందిని అదుపులోకి తీసుకుని వారిలో నలుగురిపై ఎన్‌ఐఎ కేసులు నమోదు చేసింది. ఈ తనిఖీలలో విదేశాల నుంచి నగదు బదిలీ, బ్యాంక్ ఖాతాల లావాదేవీలను ఎన్‌ఐఎ గుర్తించింది. తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, కడప, కర్నూలు, గుంటూరు జిల్లా ల్లో 60 ఎన్‌ఐఎ బృందాలు ఏకకాలంలో దాడులు చేపట్టాయి.
 
 నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 23 బృందాలతో ఎన్‌ఐఎ తనిఖీలు నిర్వహించగా కర్నూలు, కడప జిల్లాలతో పటు గుంటూరు జిల్లాలోనూ 2 బృందాలతో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించారు.ఈ స్పెషల్ ఆపరేషన్‌లో డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్‌లు, రెండు బాకులు(పిడికత్తులు), 8.31 లక్షల రూపాలకుపైగా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికార ప్రతినిధి తెలిపారు.
 
ఈ ఏడాది జులై 4న నలుగురు పిఎఫ్‌ఐ నేతలు అబ్దుల్లా ఖాదీర్, షేక్ స హదుల్లా, ఇంబ్రాన్, అబ్దుల్ మోబిన్‌లు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుల ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసుపై ఎన్‌ఐఎ దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు నిర్వహించిన సోదాలలో పలువురు అనుమానితుల ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది.
 
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సూరారం సాయిబాబా నగర్ సూరారాం సాయిబాబనగర్ లోని పలు ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పిఎఫ్‌ఐ సంస్థలో సభ్యత్వం ఉన్న వ్యక్తి ని విచారించి పలు హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకుంది. అలాగే ఎపిలోని నంద్యాలలో పిఎఫ్‌ఐ కార్యకర్త యూనస్ అహ్మద్ ఇంట్లో సోదాలు నిర్వహించి డైరీతో పాటు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
 
భైంసా అల్లర్లతో సంబంధాలపైనా ఎన్‌ఐఎ ఆరా తీయడంతో పాటు సోదాల సమయంలో అనుమానితులు ఇళ్లలో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.. తనిఖీల ప్రాంతాల నుంచి సీసీటీవీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. పీఎఫ్ఐతో సంబంధం ఉన్న వహీద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలుస్తోంది. 
“పిఎఫ్‌ఐ సభ్యులు కరాటే తరగతుల పేరుతో యువతకు కోచింగ్, శారీరక వ్యాయామాలు ప్రారంభించారు. వారి అసహ్యకరమైన ప్రసంగాలతో ఒక నిర్దిష్ట సమాజానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టేవారు” అని ఎఫ్‌ఐఆర్ లో నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.
 
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్  ఫారంలో షేక్ ముఖిద్ ఇంట్లో  ఎన్ఐఏ అధికారుల సోదాలు ముగిశాయి. బ్యాంక్ అకౌంట్, లావాదేవీలపై ఎన్ఐఏ వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పాస్ పోర్టు సీజ్ చేసిన అధికారులు..బ్యాంక్ పాస్ బుక్ లను తీసుకెళ్లారు. హైదరాబాద్ లోని  ఎన్ఐఏ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు.
 
జగిత్యాల జిల్లా  కేంద్రంలోని  టీఆర్ నగర్ లో ఉన్న  4 ఇళ్లతో పాటు మెడికల్ షాపులో  సోదాలు చేశారు. టవర్ సర్కిల్  ఏరియాలో సోదాలు  జరిగాయి. ఈ తనిఖీల్లో  ఒకరి ఇంట్లో   డైరీతో పాటు పలు కీలక పేపర్లను  స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని  మదీనా కాలనీలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో  ఎన్ఐఏ  అధికారులు తనిఖీలు జరిపారు.
 
పీఎఫ్‌‌‌‌ఐ కన్వీనర్లు అబ్దుల్‌‌‌‌ ఖదీర్‌‌‌‌‌‌‌‌, షేక్‌‌‌‌ సహదుల్లా, మహ్మద్‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌, అబ్దుల్‌‌‌‌ మొబిన్‌‌‌‌లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో టెర్రర్ లింకులు బయటపడడంతో ఆగస్టు 26న ఎన్‌‌‌‌ఐఏ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఏపీ, తెలంగాణలో యాక్టివ్ గా ఉన్న పీఎఫ్ఐ నేతల డేటా సేకరించింది. కరాటే, లీగల్ అవేర్ నెస్ పేరుతో పీఎఫ్‌‌‌‌ఐ టెర్రర్ శిక్షణ ఇస్తోందని ఆధారాలు సేకరించింది.
ఈ క్యాంపుల్లో 500 మందికి పైగా ట్రైనింగ్ పొందినట్లు ఎన్ఐఏ ఆధారాలు సేకరించిందని తెలిసింది. వీరిలో మైనర్లు కూడా ఉన్నారని సమాచారం. 2006లో ఏర్పాటైన నేషనల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌(ఎన్‌‌‌‌డీఎఫ్‌‌‌‌) నుంచి పాపులర్ ఫ్రంట్‌‌‌‌ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అవతరించింది.