కొత్త ఉద్యోగాలు పెంచడమే లాజిస్టిక్స్ పాలసీ లక్ష్యం

కొత్త ఉద్యోగాలను సృష్టించడం, యువత  స్కిల్స్‌‌‌‌ను పెంచడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ  శనివారం ప్రారంభించారు. లోకల్‌‌ ప్రొడక్ట్‌‌లు గ్లోబల్‌‌గా అమ్ముడు కావాలంటే సిస్టమ్‌‌ సపోర్ట్ ఉండాలని, గతి శక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీతో దేశంలో కొత్త వర్క్ కల్చర్ క్రియేట్ అవుతుందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.

ఈ విధానం రూపకల్పనతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేదిశలో మరో కీలక అడుగు వేసినట్లు కాగలదని ప్రధాని చెప్పారు. లాజిస్టిక్స్ ఖర్చులు  ప్రస్తుతం ఉన్న 13–14 శాతం నుంచి సింగిల్ డిజిట్‌‌కు దిగిరావాలని ఆయన చెప్పారు. ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌‌పోర్టేషన్ కోసం వాటర్‌‌‌‌ వేస్‌‌ ప్రాజెక్ట్‌‌లను కూడా డెవలప్ చేస్తున్నామని వివరించారు. 

కాగా,   గ్లోబల్ స్టాండర్డ్స్‌‌లో దేశ లాజిస్టిక్స్ సెక్టార్‌‌‌‌ ఉండేలా  చేసేందుకు ఈ పాలసీ కింద నాలుగు కీలక విభాగాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంటిగ్రేషన్‌‌ ఆఫ్ డిజిటల్ సిస్టమ్‌‌ (ఐడీఎస్‌‌) కింద దేశంలోని ఏడు డిపార్ట్‌‌మెంట్ల కింద నడుస్తున్న 30 సిస్టమ్స్‌‌ను ఇంటిగ్రేట్ చేయనున్నారు. రవాణా, లాజిస్టిక్ రంగాలలో, ముఖ్యంగా మారుమూల ప్రదేశాలలో డ్రోన్ టెక్నాలజీ ఓ కీలకమైన అంశం కాగలదని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

రోడ్డు ట్రాన్స్‌‌పోర్ట్ , రైల్వేస్‌‌, కస్టమ్స్‌‌, ఏవియేషన్‌‌, ఫారిన్ ట్రేడ్‌‌, కామర్స్ మినిస్ట్రీలకు చెందిన డిపార్ట్‌‌మెంట్‌‌లు  ఐడీఎస్‌‌ కింద ఇంటిగ్రేట్ అవుతాయి. యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌‌‌‌ఫేస్ ప్లాట్‌‌ఫామ్‌‌ (యూఎల్‌‌ఐపీ) కింద దేశంలో కార్గో రవాణాను సులభం చేయనున్నారు. ఈజ్‌‌ ఆఫ్ లాజిస్టిక్స్‌‌ (ఈఎల్‌‌ఓజీ) కింద లాజిస్టిక్స్ బిజినెస్‌‌ను సులభతరం చేస్తారు. 

లాజిస్టిక్స్ ప్రాజెక్ట్‌‌లు ఆలస్యం కాకుండా ఉండేందుకు సిస్టమ్‌‌ ఇంప్రూవ్‌‌మెంట్‌‌ గ్రూప్ (ఎస్‌‌ఐజీ) కింద వివిధ మినిస్ట్రీలకు చెందిన  ఆఫీసర్లు కొంత మంది ఈ ప్రాజెక్ట్‌‌లను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. నేషనల్ లాజిస్టిక్స్ పాలసీతో యువత స్కిల్స్‌‌ పెంచడంపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ట్రెయినింగ్ ఇన్‌‌స్టిట్యూట్లలో ఇందుకోసం కొత్త సిలబస్ చేర్చనున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు.