సేఫ్టీ రూల్స్​ పాటించకపోవడంతో అగ్నిప్రమాదం

సేఫ్టీ రూల్స్​ పాటించకపోవడంతోనే  సికింద్రాబాద్ అగ్ని ప్రమాదానికి కారణమని అగ్నిమాపక దళ​ అధికారులు తెలిపారు. ఈ మేరకు మూడు పేజీల నివేదికలో ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. లిథియం బ్యాటరీ పేలుళ్ల వల్ల దట్టమైన పొగలు వ్యాపించాయని, బిల్డింగ్‌‌‌‌కి ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే  ఉండడంతో  భారీ ప్రమాదం జరిగిందని  తెలిపారు.

రూబీ లాడ్జీలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసినా అవి పనిచేయలేదని, భవనం మొత్తం కూడా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండిపోయిందని, ఈ భవనానికి కనీసం కారిడార్ కూడా లేదని అగ్నిమాపక శాఖ నివేదికలో పేర్కొంది. ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదని, భవన, హోటల్ యజమాని నిర్లక్ష్యంతోనే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు.  

లిఫ్ట్ పక్కన మెట్లు ఏర్పాటు చేయకూడదన్న నిబంధన పట్టించుకోలేదని స్పష్టం చేసింది. అగ్నిప్రమాదంలో దట్టమైన పొగ వ్యాపించడం వల్లే 8 మంది చనిపోయారని అగ్నిమాపక శాఖ అదనపు డిజి సంజయ్ కు మార్ తెలిపారు. నిర్వాహకులు ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ రూల్స్‌‌‌‌పాటించలేదని, స్మోక్ డిటెక్టర్లు పనిచేయలేదని అధికారులు తెలిపారు.

ప్రమాదానికి బిల్డింగ్‌‌‌‌ యజమానులు, ఎలక్ట్రిక్‌‌‌‌  బైక్స్‌‌‌‌ నిర్వాహకులనే బాధ్యులుగా నిర్ధారించారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఈ-బైకు షోరూమ్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రూబీ ప్రైడ్ భవనానికి నాలుగు అంతస్థులకే జిహెచ్‌ఎంసి అనుమతి ఉందని కానీ అదనంగా మరో అంతస్థు నిర్మించినట్లు గుర్తించామన్నారు. 

సెల్లార్‌లో కేవలం పార్కింగ్ మాత్రమే చేయడానికి అనుమతి ఉండగా విద్యుత్ వాహనాల విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. సెల్లార్‌‌‌‌‌‌‌‌లో పార్క్‌‌‌‌  చేసిన ఎలక్ట్రిక్‌‌‌‌ బైక్స్‌‌‌‌లో రాత్రి 9.17 గంటలకు ఓ బ్యాటరీ పేలింది. బ్యాటరీలోని లిథియంతో ఒక్కో బైక్‌‌‌‌కు మంటలు వ్యాపించాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే సెల్లార్‌‌‌‌‌‌‌‌లోని 37  బైకులు దగ్ధం అయ్యాయి.

అలాగే రూబీ ఫైనాన్స్‌‌‌‌  నిర్వాహకులు  సీజ్‌‌‌‌ చేసిన బైకుల పెట్రోల్‌‌‌‌ వల్ల కూడా మంటలు వ్యాపించాయి.  సెల్లార్‌‌‌‌‌‌‌‌ నుంచి నాలుగు అంతస్తుల దాకా అగ్నికీలలు వ్యాపించాయి. ప్రత్యక్ష సాక్షి మన్మోహన్‌‌‌‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జి నిర్వాహకులు సుమిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ను ప్రధాన నిందితుడిగా, మేనేజర్‌‌‌‌‌‌‌‌ సుదర్శన్  నాయుడును ఏ2గా  చేర్చారు. ఎలక్ట్రిక్‌‌‌‌ బైక్స్‌‌‌‌ నిర్వాహకుడు రంజిత్‌‌‌‌ సింగ్‌‌‌‌ బగ్గాను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.