లిజ్‌ ట్రస్‌ మంత్రివర్గంలో కీలకం బ్రిటీషేతరులు.. ఇద్దరు భారత సంతతి

బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ తన మంత్రివర్గంలో దేశ చరిత్రలో మొదటిసారిగా ఇద్దరు భారత సంతతికి చెందిన వారితో సహా అందరూ బ్రిటన్‌యేతరులనే నియమించారు. బ్రిటన్ లోని ముఖ్యమైన నాలుగు అత్యున్నత స్థానాల్లోనూ బ్రిటన్‌యేతరులను ఎంపిక చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
 
తమది విభిన్న, వైవిధ్య కేబినెట్ అని తెలిపారు. అయితే కీలక పదవులలో వివిధ జాతులకు చెందిన మైనార్టీలకు స్థానం కల్పించారు. తొలిసారిగా బ్రిటన్ కేబినెట్‌లో శ్వేతజాతీయులకు కీలక పదవులు దక్కలేదు.  మంత్రిపదవులు దక్కిన వారిలో భారతీయ సంతతికి చెందిన మహిళ స్యూయెలా బ్రేవరెమెన్ దేశ హోం మంత్రి అయ్యారు. భారత్‌లోని ఆగ్రాలో జన్మించిన అలోక్ వర్మ తమ ఇంతకు ముందటి కాప్ 26 అధ్యక్షులుగా ఉంటారు. 
 
అదే విధంగా రక్షణ మంత్రిగా బెన్ వెల్సెస్ కొత్త కేబినెట్‌లోనూ ఉన్నారు. జూనియర్ మంత్రి రణిల్ జయవర్థనే లండన్‌లో జన్మించినా ఆయన శ్రీలంక, వారసత్వ మూలాలున్న వ్యక్తి. ఆయన ఇప్పుడు పర్యావరణ, ఆహార, గ్రామీణ వ్యవహారాల మంత్రిగా నియమితులు అయ్యారు.
 
1960లో ఘనా నుండి వచ్చి బ్రిటన్‌లో స్థిరపడిన కుటుంబానికి చెందిన క్వాసీ క్వార్టెంగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు. విదేశాంగ మంత్రిగా మరో నల్ల జాతీయుడైన జేమ్స్‌ క్లీవర్లీని ఎంపిక చేశారు. క్లీవర్లీ తల్లి సియెర్రా లియోనుకు చెందిన వ్యక్తి కాగా, తండ్రి బ్రిటన్‌కు చెందిన వారు. 
 
విభిన్న జాతులకు చెందిన పిల్లవాడిగా వేధింపులకు గురయ్యానని, అలాగే నల్ల జాతి ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీ మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గతంలో క్లీవరీ పేర్కొన్నారు. ట్రెజరీ చీఫ్‌ సెక్రటరీగా పౌల్‌ బోటెంగ్‌ బాధ్యతలు చేపట్టారు. దశాబ్దాల క్రితం వరకు శ్వేత జాతీయుల నిండిపోయిన బ్రిటన్‌ క్యాబినెట్‌లో మొదటి సారిగా 2002లో నల్ల జాతీయుడైన పౌల్‌ బోటెంగ్‌ను మైనారిటీ మంత్రిగా నియమించడం గమనార్హం.
 
ప్రధాని పదవికి పోటీలో రిషి సునాక్‌కు మద్దతు పలికిన పలువురు మంత్రులు ఇప్పుడు పదవీచ్యుతులు అయ్యారు. వీరిలో మాజీ న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్, రవాణా మంత్రి గ్రాంట్ షాప్స్ , ఆరోగ్య మంత్రి స్టీవీ బార్క్‌లే ఉన్నారు. కేబినెట్ ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా కొలిక్కి రాలేదు.
 
 కేబినెట్‌లో ఉప ప్రధానిగా థెరెసె కాఫీయి ఉంటారు. కొత్త కేబినెట్‌లో తాను పదవి తీసుకోనని ముందుగానే సునాక్ ప్రకటించారు. భారతీయ మూలాలున్న సునాక్‌కు కేబినెట్‌లో ట్రస్ స్థానం కల్పించకపోవడమే కాకుండా ఆయన వర్గీయులను పక్కకు పెట్టారు.
 
లిజ్ ట్రస్ బుధవారం తమ తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో ప్రస్తుత తీవ్ర సమస్య అయిన ఇంధన సంక్షోభ నివారణకు మార్గాలపై తొలి భేటీలో దృష్టి సారించారు. ప్రజలకు తీవ్రస్థాయిలో వచ్చిపడుతున్న విద్యుత్ బిల్లుల సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించడంపై చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీలో శ్వేతజాతీయుల ఆధిపత్యం కొనసాగుతున్నదని, రిషి సునాక్ ఓటమికి శ్వేతజాతీయులు కాకపోవడం ఓ ప్రధాన కారణమనే బలమైన అభిప్రాయం కొనసాగుతూ ఉంది. దానితో రాబోయే సారస్వత ఎన్నికలలో బ్రిటీషేతరుల ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఆమె వ్యూహాత్మకంగా క్యాబినెట్ కూర్పు చేసినట్లు  పరిశీలకులు భావిస్తున్నారు.