బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా భార‌త‌ సంత‌తి మ‌హిళ బ్రెవ‌ర్మాన్

భార‌త సంత‌తికి చెందిన న్యాయ‌వాది సుయెల్లా బ్రెవ‌ర్మాన్ బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా నియ‌మితుల‌య్యారు. మ‌రో భార‌తీయ సంత‌తి మ‌హిళ ప్రీతి ప‌టేల్ స్థానంలో బ్రెవ‌ర్మాన్ ఆ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించ‌నున్నారు. రెండు రోజుల క్రితం బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా ఎన్నికైన లిజ్ ట్ర‌స్ కొత్త క్యాబినెట్‌ను విస్త‌రిస్తున్నారు.

42 ఏళ్ల కన్జ‌ర్వేటివ్ పార్టీ నేత అయిన బ్రెవ‌ర్మాన్‌  గ‌త బోరిస్ ప్ర‌భుత్వంలో అటార్నీ జ‌న‌ర‌ల్‌గా చేశారు. బ్రెవ‌ర్మాన్‌ను హోంశాఖ మంత్రిగా కొత్త ప్ర‌ధాని లిజ్ నియ‌మించారు.  సుయెల్లా బ్రెవ‌ర్మాన్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీలో న్యాయ విద్య‌ను అభ్య‌సించారు. 2018లో రాయ‌ల్ బ్రెవ‌ర్మాన్‌ను ఆమె పెళ్లాడారు. క్యాబినెట్ మంత్రిగా ఉంటూనే ఆమె రెండో పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. బ్రెవ‌ర్మాన్ బౌద్ద మ‌తాన్ని స్వీక‌రించారు.

 లండ‌న్ బుద్దిస్ట్ సెంట‌ర్‌కు ఆమె వెళ్తుంది. బుద్ధుడి బోధ‌న‌లైన ధ‌మ్మ‌పాద ప్ర‌కారం ఆమె పార్ల‌మెంట్‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు. సుయెల్లా బ్రెవ‌ర్మాన్‌ త‌ల్లి త‌మిళ వ్య‌క్తి. తండ్రి గోవా ఆర్జిన్‌కు చెందిన వ్య‌క్తి. ఆయ‌న పేరు క్రిస్టీ ఫెర్నాండేజ్‌. మారిష‌స్ నుంచి త‌ల్లి బ్రిట‌న్‌కు వ‌ల‌స వ‌చ్చింది. 1960 ద‌శ‌కంలో తండ్రి కెన్యా నుంచి వ‌ల‌స వెళ్లారు.

బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రెవ‌ర్మాన్ తన నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. త‌మ తల్లితండ్రులు బ్రిట‌న్‌ను ఎంతో ప్రేమించార‌ని, వాళ్ల‌కు ఈ  దేశం ఆశ‌ను క‌ల్పించింద‌ని, వాళ్ల‌ను భ‌ద్ర‌త‌ను ఇచ్చింద‌ని, తన రాజకీయాల‌కు వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ప‌నిచేసింద‌ని ఇటీవ‌ల ఓ వీడియోలో బ్రెవ‌ర్మాన్ పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ గెలుపొందిన వెంటనే హోం మంత్రి పదవికి ప్రీతి పటేల్ రాజీనామా చేశారు. ఆ విధంగా ఆమె మంత్రివర్గంలో పనిచేయడం పట్ల విముఖత వ్యక్తం చేశారు.