చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియా అంబాసిడర్‌లుగా ఉండాలి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లను బ్రాండ్ ఇండియాకు అంబాసిడర్‌లుగా ఉండాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి  పీయూష్ గోయల్ పిలుపిచ్చారు.  అమెరికాలోని 6 ప్రాంతాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)ని ప్రారంభించిన అనంతరం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

ఐసీఏఐ ఆఫీస్ బేరర్‌లు తమ వృత్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషికి మంత్రి అభినందనలు తెలిపారు. రాబోయే 25 సంవత్సరాలు భారతదేశం ఒక శక్తిగా ఎదగడానికి, భౌగోళిక రాజకీయ రంగంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సాధించడానికి చాలా కీలకమైన సమయం అని ఆయన తెలిపారు. భారతదేశం చేస్తున్న ఈ ప్రయాణంలో ఐసిఏఐ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
 ఐసిఏఐ వంద అంతర్జాతీయ కార్యాలయాలను కలిగి ఉండే సమయం కోసం తాను ఎదురు చూస్తున్నానని చెబుతూ  ప్రపంచవ్యాప్తంగా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారని చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్ ప్రొఫెషనల్స్ సమగ్రతకు సంరక్షకులని అంటూ సీఏ సిగ్నెచర్ గురించి ప్రస్తావించారు.   చిత్తశుద్ధి, నిజాయితీకి గుర్తుగా ఈ సంతకం విలువ సీఏల పనిని మరింత గంభీరంగా మరియు సీరియస్ గా మార్చిందని పేర్కొన్నారు.

118 సంవత్సరాలలో తొలిసారిగా 2022 నవంబర్‌లో ముంబైలో జరగనున్న 21వ ప్రపంచ అకౌంటెంట్స్ కాంగ్రెస్‌ను ప్రస్తావిస్తూ.. భారతదేశం జీ20 అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ఇది జరగాలని నిర్ణయించుకున్నట్లు గోయల్ చెప్పారు. దేశాల మధ్య భారతదేశానికి పెరుగుతున్న ఔచిత్యానికి ఇది గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు.

కల్లోల ప్రపంచంలో భారతదేశం సుస్థిర ద్వీపమని తెలిపిన మంత్రి, నేడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఒకటని చెప్పారు. ద్రవ్యోల్బణంపై భారతదేశ  దృష్టిని పేర్కొంటూ 2014 నుండి, ద్రవ్యోల్బణం ఆర్బీఐ ప్రాథమిక దృష్టి అని ప్రభుత్వం నిర్ధారిస్తున్నదని,  2014 నుండి, భారతదేశం సగటున 4.5% ద్రవ్యోల్బణాన్ని చూసిందని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇది మనం ఏ 8 సంవత్సరాలలో చూసినా కనిష్ట స్థాయి అని మంత్రి తెలిపారు.

నేడు ప్రపంచంలో అనిశ్చిత ద్రవ్యోల్బణం దృష్ట్యా భారతదేశం అత్యంత అనుకూలమైన పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటి అని పేర్కొంటూ నేడు ప్రపంచానికి ప్రాధాన్యత కలిగిన భాగస్వామి అని మంత్రి గోయల్ స్పష్టం చేశారు.  ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా భారత్‌తో తమ భాగస్వామ్యాన్ని, వాణిజ్యాన్ని విస్తరించడానికి ప్రపంచ నాయకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. 

 
మనం ఆస్ట్రేలియా, యుఎఇలతో రెండు విజయవంతమైన ఎఫ్‌టిఎలను కలిగి ఉన్నామని  యుకెయూతో చర్చలు చివరి దశలో ఉన్నాయని,  అది బహుశా దీపావళి నాటికి ముగుస్తుందని తెలిపారు. సులభతర వ్యాపారాన్ని మెరుగుపరచడానికి జీఎస్టీ,ఐబీసీ, డీక్రిమినలైజేషన్, సమ్మతి తగ్గింపు, భారతదేశానికి వచ్చే కొత్త వ్యాపారాలపై తక్కువ కార్పొరేట్ పన్ను, డివిడెండ్ పంపిణీ పన్నులు, జాతీయ సింగిల్ విండో వంటి మార్పులను మార్చే ఆర్థిక సంస్కరణల గురించి మంత్రి మాట్లాడారు. వ్యాపారం,  ఆర్థిక కార్యకలాపాలను విస్తరించేందుకు భారతదేశంలో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు.