
ఎడతెరిపిలేని భారీ వర్షాలతో బెంగళూరు లోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగి తేలుతున్నాయి. నగరం లోని ముఖ్య జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించింది. వరదనీటితో నగరం జలమయం కావడం వారంలో ఇది రెండోసారి. అపార్టుమెంట్లు పునాదులన్నీ నీటిలో మునిగాయి.
అత్యవసరం తప్ప ప్రజలెవరూ బయటకు వెళ్లరాదని, పిల్లలను స్కూళ్లకు పంపరాదని ట్రాఫిక్ అధికార యంత్రాంగం హెచ్చరించింది. ఎకోస్పేస్ సమీపాన ఔటర్ రింగ్ రోడ్డు, బెల్లందూర్, కెఆర్ మార్కెట్, సిల్క్ బోర్డు జంక్షన్, వర్తూర్ ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. ఐటి కారిడార్ కూడా జలమయమైంది. హెచ్‌బిఆర్ లేఅవుట్‌లో అనేక ఇళ్లు వాన నీటిలో మునిగాయి.
ఆదివారం రాత్రి బెంగళూరులో కుండపోతగా వర్షం కురిసింది. సీవీ రామన్ నగరంలో అత్యధికంగా 44 సెంటీమీటర్ల వర్షం కురవగా.. ఇతర ప్రాంతాల్లోనూ 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఇప్పుడు సోమవారం రాత్రి సైతం భారీ వర్షం పడింది. అంతకు ముందు నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తమైంది.
ప్రధాన రహదారులపైనే ఇలా ఉంటే, లోతట్టు ప్రాంతాల్లో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలను తరలించేందుకు బోట్లను ఉపయోగించాల్సి వస్తోంది. ఇప్పటికే బెంగళూరు నగరంలో విద్యాసంస్థలు మూసివేశారు. భారీ వర్షం ధాటికి ఎయిర్ పోర్టు ప్రయాణికుల లాంజ్ వరకు నీళ్లు వచ్చాయి.
నగరంలోకి ఐటి కారిడార్‌ను భారీ వర్షం ముంచెత్తింది. పలు కంపెనీ ఆఫీసుల్లోకి వరదనీరు చేరింది. దీంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలనిఅమెజాన్, విప్రో, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు సూచిస్తునాుయి.
వర్షం కారణంగా తమ కంపెనీలకురూ.225 కోట్లమేర నష్టం వాటిల్లినట్టు బెంగుళూరు ఔటర్ రింగ్‌రోడ్ కంపెనీస్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బమ్మైకి లేఖ రాసింది. దీనిపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని సిఎం హామీ ఇచ్చారు. బెంగుళూరులో సెప్టెంబర్ 9 వరకువర్షాలు కురిసే అవకాశముందనివాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వైట్‌ఫీల్డ్ మెయిన్ రోడ్, ఓల్డు ఎయిర్‌పోర్టు, బలగెరె మెయిన్ రోడ్డు, సర్జాపూర్ రోడ్, యెమలూరు మెయిన్ రోడ్డు ట్రాఫిక్ స్తంభించింది. గోల్డ్‌మాన్ సాచ్స్, స్విగ్గీ వంటి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటివద్దనుంచే పనిచేయాలని సూచించాయి.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం