
మరో లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన ప్రాజెక్టులు సైతం త్వరలోనే రానున్నాయని ఆయన వెల్లడించాయిరు. కర్నాటక లో గత 8 సంవత్సరాలలో ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన రైల్వే బడ్జెటు నాలుగింతలు పెరిగిందని ప్రధాని చెప్పారు. దేశంలో పేద ప్రజల కోసం 3 కోట్లకు పైగా ఇళ్ళను నిర్మించామని చెబుతూ కర్నాటకలో
జల్ జీవన్ మిషన్ లో భాగంగా దేశంలో 6 కోట్లకు పైగా కుటుంబాలను కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలో గొట్టపు మార్గాల ద్వారా నీటి సరఫరా సదుపాయంతో జత పరచచిన్నట్లు తెలిపారు. గొట్టపు మార్గం ద్వారా నీరు కర్నాటకలో 30 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు అందిందని చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగంగా దేశంలో సుమారు 4 కోట్ల మంది పేద ప్రజానీకం ఆసుపత్రిలలో చేరిన కాలంలో ఉచిత వైద్య చికిత్స ను అందుకొన్నారని మోదీ వెల్లడించారు. ‘‘దీనితో దాదాపు రూ. 50 వేల కోట్లను పేదల కోసం వెచ్చించి ఉండవలసిన సొమ్ము అనేది ఆదా అయింది. కర్ణాటకకు చెందిన 30 లక్షల మందికి పైగా రోగులు కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా లాభపడ్డారు’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
చిన్న రైతులు, చిన్న వ్యాపారులు, చేపలను పట్టేవారు, వీధి వ్యాపారస్తులు, అలాగే కోట్ల మంది ఆ కోవకు చెందిన ప్రజలు మొట్టమొదటిసారిగా దేశాభివృద్ధి తాలూకు ప్రయోజనాలను అందుకోవడం మొదలు పెట్టారని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ‘‘వారు భారతదేశం ప్రగతిలో పాలుపంచుకొంటున్నారు’’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కరోనా కాలంలో భారతదేశం అమలు పరచిన విధానాలు, నిర్ణయాలు భారతదేశపు అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాయని ప్రధాని పేర్కొన్నారు. ‘‘కిందటి సంవత్సరంల, ప్రపంచంలో అనేకమైన అంతరాయాలు తలెత్తినప్పటికీ భారతదేశం ఎగుమతులు మొత్తం కలుపుకొంటే 670 బిలియన్ డాలర్ తో సమానమైన విలువ కలిగినవిగా ఉన్నాయి. రూపాయలలో అయితే ఈ మొత్తం రూ. 50 లక్షల కోట్లు” అని ప్రధాని వివరించారు.
ప్రతి ఒక్క సవాలును అధిగమిస్తూ, భారతదేశం 418 బిలియన్ డాలర్ విలువైన వస్తురూప ఎగుమతులతో ఒక కొత్త రెకార్డు ను సృష్టించిందని మోదీ వెల్లడించారు. ఇది రూ. 31 లక్షల కోట్లకు సమానం’ అని ప్రధాన మంత్రి చెప్పారు.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు