దేశంలోనే తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్‌

దేశంలోనే తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను గురువారం విడుదల చేశారు. ‘‘90 శాతం గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్ట వైరస్ వల్ల వస్తుందని, ఈ వ్యాక్సిన్ ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది’’ అని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్‌పర్సన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ డాక్టర్ ఎన్‌కె అరోరా చెప్పారు. 
గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను తయారు చేసే బాధ్యతను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత నెలలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు  అప్పగించింది.
ఢిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డా. జితేందర్ సింగ్  ప్రారంభించారు.ఈ వ్యాక్సిన్ రాకతో భారతదేశ వైద్య శాస్త్రంలో ఒక మైలురాయి సాధించినట్లయింది. గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను గురువారం ప్రారంభించారు.
9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలో  మహిళలు ఎక్కువగా ఈ క్యాన్సర్  కు బాధితులవుతున్నారు. ప్రతి ఏటా సుమారు 1.32 లక్షల మంది మహిళలు దేశంలో ఈ కాన్సర్ కు గురవుతుండగా, సుమారు 77,000 మంది మృతి చెందుతున్నారు.   గర్భాశయ క్యాన్సర్ వల్లన  ప్రపంచంలో చనిపోతున్నవారిలో మూడోవంతు మంది భారతీయ మహిళలే అని చెబుతున్నారు.