కుటుంభ నియంత్రణ ఆపరేషన్లలో నిర్లక్ష్యం .. నలుగురు బాలింతల మృతి 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం క్లస్టర్‌ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌  చేయించుకున్న మహిళల్లో  నిర్లక్ష్యం కారణంగా నలుగురు బాలింతలు మృతి చెందడం, మరో 25 మంది ఇన్ఫెక్షన్లతో దవాఖాన్ల పాలవడం వైద్య ఆరోగ్యశాఖలో కేసీఆర్ ప్రభుత్వ నేరమయ నిర్లక్ష్యాన్ని వెల్లడి చేస్తుంది.

ఆగష్టు 25న జరిగిన ప్రత్యేక శిబిరంలో 34 మంది శస్త్రచికిత్స చేయించుకొంటే నలుగురు మృతి చెందడం, 25 మంది అనారోగ్యానికి గురికావడం గమనార్హం. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయడం, ఆపరేషన్లు చేసిన వైద్యుడి వైద్య లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేయడం, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించడం ద్వారా ప్రభుత్వం తప్పిదం ఏమీ లేదన్నట్లు వ్యవహరిస్తున్నది. 

వీటితో పాటు బాధితుల కుటుంబాలకు  డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, వారి పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే ఇటువంటి దుర్ఘటనలు కారణమైన నేరమయ నిర్లక్ష్యం ప్రదర్శించిన ప్రభుత్వంలోని పెద్దలు ఎవ్వరు జవాబుదారీ కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. 

అవసరమైన వైద్యులను నియమించక పోవడం, తగు సాధన సంపత్తిని సమకూర్చక పోవడంతో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వమే చెలగాటమాడే పరిస్థితి నెలకొన్నట్లు స్పష్టం అవుతున్నది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించే విషయంలో ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

డబుల్ పంక్ఛర్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్లను నియమించుకోకుండా కేవలం నలుగురితోనే వేల సర్జరీలు చేయిస్తున్నారు. ఇందులోనూ ఒకరు రిటైర్డ్ డాక్టర్ కావడం గమనార్హం. నిరుడు రాష్ట్రంలో 502 క్యాంపులు పెట్టి, ఈ నలుగురు డాక్టర్లతోనే 24,233 డీపీఎల్ సర్జరీలు చేయించారు. 

అంటే, సగటున ఒక్కో డాక్టర్ 125 క్యాంపులు నిర్వహించి, 6058 సర్జరీలు చేసినట్టు లెక్క. ఒక్కో డాక్టర్ ఒక్కో క్యాంపులో 48 చొప్పున సర్జరీలు చేసినట్టు ఈ వివరాలు స్పష్టం చేస్తున్నయి. ఈసారి  మరీ దారుణంగా ఒక్కో క్యాంపులో 60 సర్జరీలు చేశారు. 

నిబంధనల ప్రకారం ఒక క్యాంపులో 30కి మించి సర్జరీలు చేయకూడదు. క్యాంపులో ఒక్కరే డాక్టర్ ఉంటే 10కి మించి డీపీఎల్ సర్జరీలు చేయకూడదు. కానీ, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారులు ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి, ఒకే రోజులో పెద్ద సంఖ్యలో ఆపరేషన్లు చేయిస్తున్నారు.

ఇబ్రహీంపట్నం హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఒక్క డాక్టరే కొన్ని గంటల వ్యవధిలో34 మందికి సర్జరీ చేశారు. దీన్ని బట్టి ఎంత వేగంగా ఆయన సర్జరీలు చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆరోజు మూడు ల్యాప్రోస్కోపిక్ కిట్లు వినియోగించినట్టుగా సిబ్బంది చెబుతున్నారు. “ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్ ఇయ్యలేదు. సర్జరీ చేస్తుంటే ఏడ్చినం.. ఆపరేషన్ అయినంక ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నం’’ అంటూ బాధితులు వాపోతున్నారు. 

ఒకరి తర్వాత ఒకరికి సర్జరీ చేసే క్రమంలో, కనీసం ఆ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సరిగా స్టెరిలైజ్ చేశారా లేదా అన్నది కూడా సందేహంగా మారింది. దీనివల్ల ఒకరి జబ్బులు మరొకరికి అంటుకునే ప్రమాదం కూడా ఉంది. ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా అందరికీ సోకుతుంది.

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ వీటిని `సర్కారీ హత్యలు’ అని మండిపడ్డారు.   5 నిమిషాల్లోపు జరిగే ఆపరేషన్ కు 4 గురు చనిపోవడం తో పాటు మిగిలిన వారందరికీ ఇన్ఫెక్షనై ఆసుపత్రిలో చికిత్స పొందవలసి రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ కనీసం బాధితులను పరామర్శించడానికి రాలేదే అంటూ నిలదీశారు.

కాగా, ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర మావహక్కుల కమీషన్ సహితం  సీరియస్ అయ్యింది. మీడియాలో వచ్చిన కథనాలను సుమోటగా తీసుకున్న కమిషన్ ఘటనపై సమగ్రమైన నివేదికను అందజేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. అక్టోబర్ 10 తేదీ లోపు నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.