గోధుమపిండి ఎగుమతులపై ఆంక్షలు

ఎగుమతి పరమైనటువంటి ఆంక్షల నుంచి/ నిషేధం నుంచి గోధుమ పిండిని మినహాయిస్తూ ఇదివరలో తీసుకున్న విధానం సవరణకు ఉద్దేశించిన ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) సమావేశం ఆమోదాన్ని తెలిపింది. 

ఈ చర్య గోధుమ పిండి ధరల పెరుగుదలను కట్టడి చేయడంతో పాటుగా సమాజం లోని అత్యంత దుర్భల వర్గాల కు ఆహార భద్రతకు భరోసా ఇవ్వగలదని భావిస్తున్నారు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎప్ టి) ఒక నోటిఫికేశన్ ను జారీ చేయవలసి ఉంటుంది.

రష్యా, ఉక్రెయిన్  లు గోధుమల ప్రధాన ఎగుమతిదారు దేశాలుగా ఉన్నాయి. ప్రపంచంలో క్రయ విక్రయాలు జరిగేటటువంటి గోధుమలలో నాలుగింట ఒకటో వంతు వాటా ఈ దేశాలదే. వీటి మధ్య యుద్ధం చెలరేగడంతో ప్రపంచ గోధుమల సప్లయ్ చైన్ లో అంతరాయాలకు దారి తీసి భారతదేశం గోధుమలకు డిమాండు అధికమయింది.

తత్ఫలితంగా, దేశీయ మార్కెట్లో గోధుమల ధరలు పెరుగుతూ వచ్చాయి. దేశం లో 1.4 బిలియన్ ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇవ్వడం కోసం గోధుమల ఎగుమతపై నిషేధాన్ని అమలు చేయాలన్న నిర్ణయాన్ని 2022 మే లో ప్రభుత్వం తీసుకుంది.

అయితే, గోధుమ ఎగుమతి మీద నిషేధం అమలు లోకి తీసుకు రావడంతో విదేశీ మార్కెట్ లలో  గోధుమ పిండికి డిమాండు పెరగడమే కాకుండా, భారతదేశం నుంచి గోధుమ పిండి ఎగుమతులలో 2022 ఏప్రిల్ మొదలుకొని జులై మధ్య కాలం లో 2021 వ సంత్సరం లోని సమాన కాలం తో పోల్చితే 200 శాతం మేరకు పెరుగుదల నమోదు అయింది.

అంతర్జాతీయ బజారు లో గోధుమ పిండి తాలూకు డిమాండు అధికం కావడం అనేది దేశీయమార్కెట్  లో గోధుమ పిండి ధర లో గణనీయమైన పెరుగుదల కు దారితీసింది. ఇదివరకు, గోధుమ పిండి ఎగుమతి పైన నిషేధాన్ని గాని లేదా ఎటువంటి ఆంక్షల ను గాని విధించరాదని ప్రభుత్వ విధానం ఉండెడిది.

దానితో, ఆహార భద్రతకు భరోసా ఇవ్వడంతో పాటు, దేశం లో అంతకంతకు ఎగబాకుతున్న గోధుమ పిండి ధరలకు అడ్డుకట్ట వేయడం కోసం గోధుమ పిండికి సంబంధించిన ఎగుమతిపై నిషేధం/ఆంక్షల నుంచి మినహాయింపును ఉపసంహరించడం ద్వారా తత్సంబంధిత విధానంలో ఓ పాక్షిక సవరణ అవసరమైంది.