భారత్ నాయకులపై ఆత్మాహుతి దాడులకై ఐస్ యత్నం!

భారతదేశంలో తమ పట్టు సడలుతున్నట్లు గ్రహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐస్) ఆత్మాహుతి దాడులకు పాల్పడటానికి పధకాలు వేస్తున్నట్లు వెల్లడవుతున్నది. భారత దేశంలోని కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరపడం కోసం ఇప్పటికే పలువురిని ఎంపిక చేసి  రంగంలోకి దింపినట్లు కనిపిస్తున్నది.
అటువంటి ఇద్దరు వ్యక్తులు ఆదివారం వేర్వేరు ప్రదేశాలలో పట్టుబట్టారు. ఓ వ్యక్తి రష్యాలో ఆ  దేశ భద్రతా అధికారులకు పట్టుబడగా, మరో వ్యక్తిని జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటి దేశంలో చొరబాటుకు ప్రయత్నించిన భద్రతా దళాలకు పట్టుకున్నాయి.
 రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ ఎస్ బి)  అధికారులు సోమవారం ఒక ఆత్మాహుతి బాంబర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న బాంబర్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు, అతను భారతదేశంలో నాయకులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడటం కోసం పధకాలు వేస్తున్నాడు.

“రష్యా  ఎఫ్ ఎస్ బి  రష్యాలో నిషేధించిన ఇస్లామిక్ స్టేట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ సభ్యుడిని గుర్తించి, నిర్బంధించింది. అతను మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వాడు. అతను భారత దేశంపై చెందిన పాలక వర్గాల ప్రతినిధులలో ఒకరిపై తనను తాను పేల్చేసుకోవడం ద్వారా ఉగ్రవాద చర్యకు పాల్పడాలని ప్లాన్ చేశాడు”. అని ఒక అధికార ప్రకటనలో తెలిపారు.

అదుపులోకి తీసుకున్న వ్యక్తిని టర్కీలో ఆత్మాహుతి బాంబర్‌గా ఐఎస్ నాయకులలో ఒకరు నియమించుకున్నారని ఆ ప్రకటన జోడించింది. అతనిని గత ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో ఈ ఉగ్రవాద సంస్థ చేర్చుకున్నట్లు చెబుతున్నారు. 

“టెలిగ్రామ్ మెసెంజర్ ఖాతాల ద్వారా, ఇస్తాంబుల్‌లోని ఐఎస్  ప్రతినిధితో వ్యక్తిగత సమావేశాల ద్వారా అతనిని `సైద్ధాంతికం’గా మత్తులో పడవేస్తున్నారు ” అని కనుగొన్నారు. పట్టుబడిన  ఉగ్రవాది ఐఎస్ ఎమిర్ (చీఫ్)కి విధేయత చూపుతున్నట్లు ఎఫ్‌ఎస్‌బి గుర్తించిందని. ఆ తర్వాత రష్యాకు వెళ్లి, అవసరమైన పత్రాలను రూపొందించి, ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడేందుకు భారత్‌కు వెళ్లాలని పధకం వేసిన్నట్లు లభించిన ఐఎస్ పత్రాలు వెల్లడించాయి. 
 కాగా, ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)లో చొరబడిన ఉగ్రవాదిని భారత సైన్యం పట్టుకొంది. నౌషేరా సెక్టార్‌లోని సెహర్ మక్రి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం అనుమానాస్పద కదలికలను భద్రతా బలగాలు గమనించాయి. ఉగ్రవాదిని తబ్రాక్ హుస్సేన్‌గా గుర్తించారు. ఇతను లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) సరిహద్దు దాటి పంపిన ఆత్మాహుతి బాంబర్.


భద్రతా బలగాలను ఎన్‌కౌంటర్ చేయడంతో, ఉగ్రవాది నియంత్రణ రేఖ పాకిస్తాన్ వైపు తిరిగి పరుగెత్తడం ప్రారంభించాడు. సైనికులు అతనిపై కాల్పులు జరపడంతో అతన్ని పట్టుకున్నారు. ప్రథమ చికిత్స అందించిన అనంతరం హుస్సేన్‌ను రాజౌరిలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

విచారణ సమయంలో, నియంత్రణ రేఖ వెంబడి ఆర్మీ ఇన్‌స్టాలేషన్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి తనను ఎల్‌ఇటి ఆత్మాహుతి దళంలో భాగంగా పంపినట్లు అతను వెల్లడించాడు.

ఇస్లామిక్ స్టేట్, దానికి సంబంధించిన అన్ని సంస్థలను `ఉగ్రవాద సంస్థలు’గా భారత్ ప్రకటించింది. వాటన్నిటిని కేంద్ర ప్రభుత్వం   చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని మొదటి షెడ్యూల్‌లో చేర్చింది.

హోం మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ తన భావజాలాన్ని ప్రచారం చేయడానికి వివిధ ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తోంది. సైబర్‌స్పేస్‌ను సంబంధిత ఏజెన్సీలు నిశితంగా పరిశీలిస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాయి.