లాలూ కుటుంబంతో నితీష్ కు తలనొప్పి… అధికారిక సమావేశంలో బావమరిది!

ఎన్డీయే నుండి వైదొలిగి, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో పొత్తు ఏర్పాటు చేసుకొని, ఆయన కుమారులు ఇద్దరికీ తన మంత్రివర్గంలో స్థానం కల్పించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తొలిరోజు నుండి చిక్కులు తప్పడం లేదు. తాజాగా, లాలూ పెద్ద కుమారుడు,  బిహార్‌ పర్యావరణ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ అధికారిక సమావేశంలో లాలు ప్రసాద్‌ అల్లుడు హాజరవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది.
 మంత్రి తేజ్‌ ప్రతాప్‌ సంబంధించిన శాఖపరమైన సమావేశానికి లాలు ప్రసాద్‌ పెద్ద అ‍ల్లుడు కూడా హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో  వైరల్‌ అవ్వడంతో ఆర్జేడీ పై అధికార పార్టీ బీజేపీ విమర్శల దాడి చేసింది. లాలూ కుమార్తె, ఆర్జేడీ రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి భర్త ఈ శైలేష్‌ కుమార్‌.
వాస్తవానికి తేజ్‌ ప్రతాప్‌ ఆగస్టు 16న మంత్రిగా ‍ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజున ఆయనకు కేటాయించిన పర్యావరణం, అటవీ వాతావరణ మార్పుల శాఖ బాధ్యతలు చేపట్టారు. ఐతే ఆగస్టు 17న అరణ్య భవన్‌లో అటవీ వాతావరణ మార్పుల శాఖ సమీక్ష సమావేశానికి తేజ్‌ ప్రతాప్‌ అధ్యక్షత వహించారు.
అప్పుడు జరిగిన అధికారుల సమావేశానికి లాలు ప్రసాద్‌  పెద్ద అల్లుడు శైలేష్‌ కుమార్‌ కూడా వచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 18న బిహార్‌ పొల్యూషన్‌​ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులతో  కూడా తేజ్‌ ప్రతాప్‌ మరోసారి సమావేశమయ్యారు. ఆ సమావేశానికి కూడా శైలేష్‌ రావడమే కాకుండా ఆయనతోపాటు కలిసి కూర్చోవడంతో పెద్ద దూమారం రేగింది.
దీంతో బీజేపీ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టింది. మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ తన అధికారిక విధులను బావ శైలేష్‌ ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చాడని బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ మోదీ ఎద్దేవా చేశారు. శైలేష్‌ నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాడని ఆయన ఆక్షేపించారు. దీనిపై ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.
“తేజ్‌ ప్రతాప్‌ని ఎవ్వరూ తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే మంత్రులందరిలోనూ ఆర్జేడీ కోటా కుమారుడు శైలేష్‌ యాదవ్‌ అత్యంత తెలివైనవాడు అతని ఆశీస్సులు తేజ్‌ ప్రతాప్‌కు ఉంటే ఉత్తమ మంత్రిగా ఎదుగుతాడు.” అని ఎద్దేవా చేస్తూ బీజేపీ అధికార ప్రతినిధి శైలేష్‌ని ఉద్దేశించి విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.