ఆరెస్సెస్‌పై త్వరలోనే సినిమా, వెబ్‌ సిరీస్‌ కూడా

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై త్వరలో సినిమాతోపాటు వెబ్‌ సిరీస్‌ కూడా చిత్రీకరించనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ వెల్లడించారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యకారిని సభ్యుడు రామ్‌మాధవ్‌ రచించిన ‘ది హిందూత్వ పారడైమ్‌’ పుస్తక పరిచయ కార్యక్రమం విజయవాడలోని కేవీఎస్‌ఆర్‌ సిద్ధార్థ ఫార్మాస్యూటికల్‌ సైన్స్‌ కళాశాలలో మంగళవారం జరిగింది. సాహితీ సుధా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ. కొన్నేళ్ల క్రితం వరకూ ఆర్‌ఎస్‌ఎస్‌పై తనకున్న భావన వేరని, దానిపై చిత్రాన్ని తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్‌పూర్‌ వెళ్లి వాస్తవాలను తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నానని వివరించారు.

 ‘‘నేను రాసే కథలు తీయటి అబద్ధాలు. విన్న కథలన్నీ నిజం కావు. కొన్ని కథలు మత్రం నిజమవుతాయి’’ అని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు.  నాలుగేళ్ల కిత్రం ఆర్‌ఎ్‌సఎస్‌ మీద కథ రాయమని అడిగినప్పుడు అందుకోసం తాను నాగపూర్‌ వెళ్లాననాన్నరు. అప్పటి వరకు స్వయం సేవక్‌ గురించి పెద్దగా తెలియదని, గాంధీజీని స్వయం సేవక్‌ చంపిందన్న భావనలో ఉన్నానని చెప్పారు.

అయితే, స్వయం సేవక్‌ సంఘ్‌ లేకపోతే కశ్మీర్‌ ఉండేది కాదని, ఎప్పుడో పాకిస్థాన్‌ వశమయ్యేదని స్పష్టం చేశారు. స్వయం సేవక్‌ గురించి తెలుసుకుని పరిపూర్ణమైన పశ్చాత్తాపం చెందానని పేర్కొన్నారు. స్వయం సేవక్‌పై కథ రాసి మోహన్‌ భగవత్‌కు చూపిస్తే ఆయన ఎంతో పొంగిపోయారని చెప్పారు.

రామ్‌మాధవ్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ వాళ్లను దేశం నుంచి పంపడం ఒక్కటే స్వాతంత్రోద్యమం కాదని స్పష్టం చేశారు. బ్రిటన్‌ కంటే భారతదేశ ప్రజాస్వామ్యం గొప్పదని నిరూపించుకోగలిగామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు ఎక్కడ కావాలంటే అక్కడ రాజధానులు ఏర్పాటు చేసుకోవడం ప్రజాస్వామ్యం కాదని జగన్‌ ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు.