చేతగానితనం తోనే సంజయ్ యాత్రపై టీఆర్ఎస్ నాయకుల దాడి

చేతగానితనంతోనే టీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డరని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు.  ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ నాయకులు సోమవారం రాళ్లతో దాడికి పాల్పడటం పట్ల  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“బీర్లు, బిర్యానీలు తినిపించి టీఆర్ఎస్ నాయకులు సంజయ్పై దాడులు చేయించారని, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దేనికి పనికిరాని మినిస్టర్” అంటూ ఆయన  మండిపడ్డారు. బండి సంజయ్పై కుట్ర చేస్తే ఆయన అగుతారా .? అని ప్రశ్నించారు. పోలీసులకు దాడి విషయం ముందే తెలుసని రాజాసింగ్ ఆరోపించారు.
 
“టీఆర్ఎస్ ప్రభుత్వం మరో సంవత్సరం మాత్రమే ఉంటుంది. పోలీసులు.. ఈ రోజును యాది పెట్టుకోవాలని రాజాసింగ్ హెచ్చరించారు. బీజేపీతో పెట్టుకుంటే.. తమ  ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఆలోచన చేయాలలి” అంటూ ఆయన  వారించారు. బీజేపీ ఇదే పని చేస్తే మీ ఎమ్మెల్యేలు బయట తిరుగుతారా? అని ప్రశ్నించారు.  రాజకీయం చేయాలంటే సరిగ్గా చేయండని, లేకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తిప్పి తిప్పి కొడుతామని రాజాసింగ్ హెచ్చరించారు.  

మునుగోడు భయంతోనే దాడులు

మునుగోడు ఉప ఎన్నిక భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసరడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పాదయాత్ర చేసుకునే స్వాతంత్ర్యం లేదా అని ప్రశ్నించారు. 

దాడి వెనుక ఎర్రబెల్లి దయాకర్ రావు హస్తం ఉందని రాణి రుద్రమ ఆరోపించారు. తమపై దాడులు చేస్తే దయాకర్ రావు పాలకుర్తిలో తిరగలేరని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం  సంజయ్కు ఎందుకు రక్షణ కల్పించడం లేదని ప్రశ్నించిన ఆమె  శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ బాధ్యత వహించాల్సి ఉంటదని స్పష్టం చేశారు. 

ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణలోని ప్రతి గడపను తాకుతుందని, ప్రతి సమస్యను సంజయ్ తెలుసుకుంటారని ఆమె తేల్చి చెప్పా. ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్తామన్న రాణి రుద్రమ.. టీఆర్ఎస్ నేతలకు మునుగోడు ఉప ఎన్నిక భయం పట్టుకుందని ఆమె ఎద్దేవా చేశారు.