పవిత్ర రక్షాబంధన్ ను పురస్కరించుకొని తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ డా. తమిళ సై సౌందరరాజన్ కు విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం మాతృశక్తి, యువతి విభాగం దుర్గా వాహిని ఆధ్వర్యంలో రాఖీ కట్టారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు రాజభవన్ లో విశ్వహిందూ పరిషత్ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం తెలంగాణ తొలి మహిళకు సంప్రదాయబద్దంగా గాజులు, చీర, కుంకుమ, పసుపు అందజేసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ కమిటీ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సంప్రదాయం ఉట్టిపడేలా వేడుక నిర్వహించినందుకు విశ్వహిందూ పరిషత్ నేతలను గవర్నర్ అభినందించారు.
సంస్కృతి సాంప్రదాయం పాటించాల్సిన బాధ్యత ప్రతి మహిళ పై ఉందని ఆమె తెలిపారు. .
కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కార్యదర్శి పండరినాథ్, ఉపాధ్యక్షులు రామ్ సింగ్, సునీత రామ్మోహన్ రెడ్డి, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, మాతృశక్తి రాష్ట్ర కన్వీనర్ పద్మశ్రీ, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయ్, కో కన్వీనర్ సింధుజ, రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ శివరాములు పాల్గొన్నారు.
More Stories
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు