గోరంట్ల మాధవ్ వీడియోపై స్పీకర్ కు ఎన్సిడబ్ల్యు లేఖ!

తీవ్ర కలకలం రేపిన వైసిపి గోరంట్ల మాధవ్‌ ఎంపీ నగ్నంగా ఓ మహిళతో వీడియోలో మాట్లాడుతున్న దృశ్యాలను కప్పిపుచ్చే విధంగా అనంతపురం జిల్లా ఎస్‌పి డాక్టర్‌ కె.ఫక్కీరప్ప పేర్కొనడంపై ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. . దీనికి తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు  జాతీయ మహిళా కమిషన్‎   లేఖ రాసింది.అలాగే స్వంతంత్ర దర్యాప్తు జరిపించి వీలైనంత త్వరగా కమిషన్‎కు నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీకి ఎన్సీడబ్ల్యూ చైర్ పర్సన్ రేఖ శర్మ లేఖా రాశారు.

అటు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా వెళ్లింది. ఎంపీ జస్బీర్‌సింగ్ గిల్ మోదీకి లేఖ రాశారు. గోరంట్ల వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని ఆయన లేఖలో తెలిపారు. పార్లమెంట్ ఎంపీలకు మాయని మచ్చలా ఉందని.. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని అని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 

గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్‌కు వెళ్లిందని ఎంపీ భరత్ అన్నారని తెలిపారు. గోరంట్ల వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎంపీ జస్బీర్‌సింగ్ లేఖలో పేర్కొన్నారు. 

ఆ వీడియోపై  దర్యాప్తు జరుగుతున్నదని, వాస్తవమని తేలితే ఎంపీపై కఠిన చర్యలు తీసుకొంటామని తొలుత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీడియోను ఫోరెన్సిక్ పరీక్షకు పంపామని డిజిపి వెల్లడించారు. అయితే,  అదేమీ లేకుండానే ఈ వీడియో ఒరిజినల్‌ కాదని ప్రకటించడం విస్మయం కలిగించింది.

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఒరిజినల్‌ కాదు కాబట్టి మార్ఫింగ్‌ లేదా ఎడిటింగ్‌ జరిగి ఉండొచ్చొన్న అనుమానాలున్నాయని చెప్పారు. ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదని తెలిపారు.