అసోం రైఫిల్స్ ట్రూప్‌పై మిలిటెంట్ల కాల్పులు

మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్లు  మంగళవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని అసోం రైఫిల్స్ ట్రూప్‌పై కాల్పులు జరిపారు.తిరప్, చాంగ్ లాంగ్ జిల్లాల్లోని సరిహద్దుల్లో మయన్మార్ మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో మయన్మార్ సరిహద్దుల్లో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న అసోం రైఫిల్స్ జవాన్లు మిలిటెంట్ల దాడిని తిప్పికొట్టారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసోం రైఫిల్స్ బలగాలను మయన్మార్ సరిహద్దుల్లో మోహరించారు. మయన్మార్ మిలిటెంట్ల కాల్పుల్లో అసోం రైఫిల్స్ కు చెందిన ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసరు చేతికి స్వల్ప గాయమైంది.  మిలిటెంట్ల కాల్పుల అనంతరం సరిహద్దుల్లో అసోం రైఫిల్స్ బలగాలను మోహరించారు.క్యా, ఉల్ఫా మిలిటెంట్లు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనెడ్లు, బాంబులతో దాడి చేశారు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ మిలిటెంట్లు కాల్పులు జరిపారు.
మయన్మార్ సరిహద్దుల్లోని మారుమూల పంగసు ప్రాంతంలో మిలిటెంట్లు కాల్పులు జరిపారు.నాగాలాండ్ జిల్లా నోకలాక్ జిల్లాలోనూ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈశాన్య ప్రాంతంలో సమస్యలను పెంచడంలో పెరుగుతున్న చైనా పాత్ర గురించి జాగ్రత్తగా ఉన్నాయి. ఆపరేషన్ సన్‌రైజ్ విజయవంతమైన తర్వాత, ఈ ప్రాంతంలో తిరుగుబాటుదారుల నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడానికి చైనా తహతహలాడుతున్నట్లు ఆ వర్గాలు  ధృవీకరించాయి. 
 
ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరచడం చైనా వ్యూహం.  తద్వారా భారత సేనల దృష్టి మళ్లించి, వారిని ఎల్ఎసి వద్ద చైనా సవాలును ఎదుర్కొనకుండా  కట్టడి చేయాలని భావిస్తున్నారు. భారత్ తో సంబంధం లేకుండా,  మయన్మార్, బంగ్లాదేశ్ మీదుగా బంగాళాఖాతంకు  వాణిజ్య మార్గాన్ని అభివృద్ధి చేయడంలో చైనా కూడా ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.

అపఖ్యాతి పాలైన గోల్డెన్ ట్రయాంగిల్ (థాయిలాండ్, లావోస్, మయన్మార్ సరిహద్దులు రువాక్, మెకాంగ్ నదుల సంగమం వద్ద కలిసే ప్రాంతం) నుండి ఈశాన్య ప్రాంతానికి మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యాన్ని పంపడం వెనుక చైనా పాత్ర ఉందని భావిస్తున్నారు. వీటిని మయన్మార్ సైన్యానికి సరఫరా జరుగుతున్నది. అలాగే ప్రాంతాన్ని అస్థిరంగా ఉంచడానికి పిడిఎఫ్ వంటి తిరుగుబాటు గ్రూపులను కూడా చైనా ప్రోత్సహిస్తున్నది.