పాకిస్థాన్ లో 1200 నాటి వాల్మీకి దేవాలయ పునరుద్ధరణ

 పాకిస్థాన్ లో 1200 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయాన్ని ఎట్టకేలకు పునరుద్ధరించనున్నారు. లాహోర్ నగరంలో కబ్జా పాలైన వాల్మీకి మందిరం సుదీర్ఘ న్యాయపోరాటంతో  పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. లాహోర్  నగరంలోని అనార్కలీ బజారులో ఉన్న వాల్మీకి దేవాలయాన్ని ఓ క్రైస్తవ కుటుంబం కబ్జా చేసింది. 20 ఏళ్ళ సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం, పాకిస్తాన్ హిందూ యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో ఈ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. 

దీంతో ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ న్యాయపోరాటం చేసి పురాతన దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది.పాకిస్థాన్ దేశంలో హిందువులు చేసిన న్యాయపోరాటం ఫలించి ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయి. క్రైస్తవ కుటుంబం హిందూ మతాన్ని స్వీకరించి రెండు దశాబ్దాలుగా వాల్మీకి మందిరాన్ని కబ్జా చేసింది.పాకిస్థాన్ దేశంలో అతి పురాతనమైన వాల్మీకి మందిరాన్నిభవిష్యత్‌లో మాస్టర్ ప్లాన్ ప్రకారం పునరుద్ధరిస్తామని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ అధికార ప్రతినిధి అమీర్ హాష్మి చెప్పారు.
కబ్జా చెర నుంచి పురాతన వాల్మీకి ఆలయాన్ని విడిపించి బుధవారం 100 మంది హిందువులు, కొందరు సిక్కులు, క్రైస్తవ నాయకులు వాల్మీకి దేవాలయంలో పూజలు జరిపి అన్నదానం చేశారు. ఓ క్రైస్తవ కుటుంబం ఈ దేవాలయాన్ని రెండు దశాబ్దాలుగా కబ్జా చేసింది. వాల్మీకి మందిరం స్థలాన్ని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ రెవెన్యూ రికార్డుల్లోకి బదిలీ చేశారు.
కాని 2010లో ఈ ఆలయ భూమి తమదేనని ఓ క్రైస్తవ కుటుంబం సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసింది. దీంతో దేవాలయం భూ వివాదంపై కోర్టు విచారణ చాన్నాళ్లు సాగింది.క్రైస్తవ కుటుంబం దావాను కోర్టు తప్పు పిటిషన్ అని కొట్టివేసింది. 1992వ సంవత్సరంలో భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం కొందరు ఆందోళనకారులు వాల్మీకి దేవాలయంపై దాడి చేసి కృష్ణ, వాల్మీకి విగ్రహాలను ధ్వంసం చేశారు.
అప్పట్లో దేవాలయాన్ని కూల్చివేసి నిప్పు పెట్టడంతో కాలిపోయింది.దీనిపై హిందువులు కోర్టుకు వెళ్లడంతో పాకిస్థాన్ సుప్రీంకోర్టు  ఏకసభ్య కమిషన్ ను నియమించింది.వాల్మీకి దేవాలయాన్ని పునరుద్ధరించి పాక్ హిందువులు పూజలు చేసుకునేలా సౌకర్యాలు కల్పించాలని సుప్రీం నియమించిన ఏకసభ్య కమిషన్ పాక్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
కోర్టులో వాల్మీకి దేవాలయ భూవివాదం కాస్తా సమసిపోవడంతో ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. కోర్టు ఆదేశాలు, పాక్ ప్రభుత్వ నిర్ణయంతో పురాతన వాల్మీకి మందిరం పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.  ఈ దేవాలయ పునరుద్ధరణ ఒక సద్భావన సంకేతం,  సమాజాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఒక అడుగు అని హిందూ దేవాలయాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు కృష్ణ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. 
 “పాకిస్తానీ హిందువుగా, హిందువులు, అవమానానికి గురైన  సమాజం ఇక్కడ భయపడే రెండు విషయాలు: విశ్వాసంకు. సామాజికంగా, రాజకీయంగా, పరిపాలనాపరంగా  సేవచ్చా కాగా;  రెండవది సామాజిక రక్షణ. ఇస్లాం పేరుతో ఏర్పాటైన దేశంలో దేవాలయాలు నేడు తెరుచుకొంటున్నాయి” అంటూ ఆనందం వ్యక్తం చేశారు. 
కాగా, బాబ్రీ మసీదు ఘటన తర్వాత 90వ దశకం ప్రారంభంలో ధ్వంసమైన ముల్తాన్‌లోని చారిత్రాత్మక ప్రహ్లాద్ దేవాలయం పునరుద్ధరణ కూడా జరుగుతున్నట్లు కృష్ణ శర్మ తెలిపారు.  హిందువుల పండుగ హోలీకి ఇది చాలా కీలకం. “మేము మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, దేశవ్యాప్తంగా అనేక ఇతర దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రపంచంలోని ప్రతి చోటా సమస్యలు ఉన్నాయి, ఈ ప్రాంతంలోని విద్వేష శక్తులు అటువంటి సమస్యల నుండి ప్రయోజనం పొందే ప్రయత్నాలు చేశారు. కాబట్టి, ఇటువంటి చర్యలు అటువంటి వారిని నిశ్శబ్దం చేయగలవు. వారి కథనాన్ని ప్రతిఘటించగలవు” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.