చైనా- పాక్ కారిడార్ లో మూడో దేశం… భారత్ అభ్యంతరం

వివాదాస్పద చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో చేరడానికి “ఆసక్తిగల” మూడవ దేశాలను స్వాగతించాలని జులై 21న జరిగిన సమావేశంలో  పాకిస్తాన్,  చైనా నిర్ణయించుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అటువంటి చర్యలు భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను నేరుగా ఉల్లంఘించగలవని భారతదేశం స్పష్టం చేసింది. ఈ ప్రాప్రాజెక్ట్ లో కీలక భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) గుండా వెళుతుంది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, “ సీపీఈసీ  ప్రాజెక్ట్‌లు అని పిలవబడే” వాటిలో మూడవ దేశాల ప్రతిపాదిత భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు రెండు దేశాల వైఖరిని ప్రస్తావిస్తూ “ఏ పార్టీ అయినా అటువంటి చర్యలు భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను నేరుగా ఉల్లంఘించగలవు” అని పేర్కొన్నారు.

అక్రమంగా ఆక్రమించబడిన భారత భూభాగంలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారనే కారణంతో 2013లో ప్రారంభించిన హైవేలు, రైలు మార్గాలు, పవర్ ప్లాంట్లు, తయారీ యూనిట్లు , భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నెట్‌వర్క్ అయిన  సీపీఈసీ  పట్ల భారతదేశ వ్యతిరేకతను బాగ్చీ పునరుద్ఘాటించారు.

“పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో ఉన్న  సీపీఈసీ  అని పిలవబడే కార్యకలాపాలను భారతదేశం దృఢంగా, స్థిరంగా వ్యతిరేకిస్తుంది. అలాంటివి స్వాభావికంగా చట్టవిరుద్ధం, ఆమోదయోగ్యం కాదు. భారతదేశం తదనుగుణంగా వ్యవహరిస్తుంది,” అని ఆయన హెచ్చరించారు. 


2013లో ప్రారంభించిన, 
సీపీఈసీ  అరేబియా సముద్రంలో పాకిస్తాన్ లోని  గ్వాదర్ నౌకాశ్రయాన్ని వాయువ్య చైనాలోని జిన్‌జియాంగ్ ఉయ్‌గుర్ అటానమస్ రీజియన్‌లోని కష్గర్‌తో అనుసంధానించే ఒక కారిడార్ఇ. ది ఇంధనం, రవాణా, పారిశ్రామిక సహకారాన్ని హైలైట్ చేస్తుంది.  సీపీఈసీ  అనేది చైనా  అధ్యక్షుడు అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కళల ప్రాజెక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బి ఆర్ ఐ). $60 బిలియన్ల ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్.

అయితే, పాకిస్తానీ రాజకీయ నాయకులు, హక్కుల సంఘాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా స్థానిక కమ్యూనిటీలకు ప్రయోజనాలను అందించకుండా దేశంలోని సహజ వనరులను దోపిడీ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. సంవత్సరాలుగా, చైనా చేపట్టిన జాతీయ ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్, పాకిస్తానీ నగరాల్లో సృష్టించాల్సిన పర్యవేక్షణ, నిఘా సామర్థ్యాల గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జూలై 21న జరిగిన అంతర్జాతీయ సహకారం, సమన్వయంపై జరిగిన సీపీఈసీ వర్కింగ్ గ్రూప్  వర్చువల్ మూడవ సమావేశంలో, చైనా,  పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌ను “బహిరంగ, సమ్మిళిత వేదిక”గా అభివర్ణించాయి.  “పరస్పర ప్రయోజనకరమైన మార్గాల నుండి ప్రయోజనం పొందేందుకు ఆసక్తిగల మూడవ పక్షాలను స్వాగతించాయి. సీపీఈసీ ద్వారా సహకారం కోరుతున్నాము” అని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.


ఇటీవల, పాకిస్తాన్,  చైనా కూడా 
సీపీఈసీ  అభివృద్ధి ఒక కొత్త దశకు చేరుకుందని అంగీకరించాయి, పరిశ్రమ, వ్యవసాయం, ఐటి, సైన్స్, టెక్నాలజీల  అధిక-నాణ్యత అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు స్పష్టమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలను భరోసా ఇస్తుంది. అయితే, అనేక పాశ్చాత్య థింక్-ట్యాంక్‌లు, వ్యాఖ్యాతలు సీపీఈసీ ని ఆర్థిక రుణ ఉచ్చుగా హెచ్చరిస్తున్నారు.