బ్రిటన్ ప్రధాని పోరులో రిషి సునాక్ కు తుది అంకంలో పెను సవాల్!

బ్రిటన్‌ ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి సునాక్‌కు తుది అంకంలో ప్రత్యర్థి నుండి పోటీ తీవ్రం కావడంతో కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ రిషికి గట్టి పోటీ ఇస్తున్న విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ తన ఆధిక్యాన్ని గణనీయంగా పెంచుకోవడం రిషికి ఆందోళన కలిగించే అంశమే. పార్టీ సభ్యుల్లో ఎక్కువమంది మితవాద ట్రస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రిషికి ఈ ఎన్నిక సవాలుకానుంది.

బోరిస్‌ జాన్సన్‌ స్థానం కోసం బరిలో నిలిచిన సునాక్‌, ట్రస్‌ ఇద్దరినీ పోటీ చివరి దశకు పంపేందుకు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ (టోరీ) సభ్యులు గురువారం ఓట్లేశారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు ప్రారంభం వరకూ జరిగే ఓటింగ్‌లో వీరిద్దరిలో ఒకరిని తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటారు. 2 లక్షల మందికి పైగా పాలక సభ్యులు వీరిలో ఒకరిని మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నుకోనున్నారు.

ఇలా ఉండగా, రిషి, లిజ్‌ ట్రస్‌లలో టోరీ సభ్యుల మద్దతు ఎవరికి అనే అంశంపై బ్రిటన్‌లో ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌, అనలిటిక్స్‌ సంస్థ అయిన ‘యూగోవ్‌’ బుధ, గురువారాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న 730 మంది సభ్యుల్లో 62 శాతం ట్రస్‌కే మద్దతు తెలిపారు. 38 శాతం  మాత్రమే రిషి సునాక్‌కు ఓటేస్తామని చెప్పారు. సర్వేల్లో రెండ్రోజుల క్రితం వరకూ 20 శాతం ఆధిక్యం సాధించిన లిజ్‌ ట్రస్‌ ఇప్పుడు 24 శాతంకు  ఎగబాకారు.

బుధవారం నాటి రౌండ్‌లో మాజీ ఛాన్సలర్‌ రిషి సునాక్‌, విదేశాంగ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌ ఇరువురూ ఫైనల్‌ అభ్యర్ధులుగా బరిలో నిలిచారు. అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మార్డంట్‌ తుది రౌండ్‌లో ఓడిపోయారు. ఈ రౌండ్‌లో రిషి సునాక్‌కు 137ఓట్లు రాగా, ట్రస్‌కు 113 ఓట్లు వచ్చాయి. ఇ

ప్పటి వరకు పోటీలో రిషి సునాక్ ముందంజలో ఉన్నప్పటికీ, ఈనాటి ఓటింగ్‌లో ఇంతకంటే ఏమీ విశ్లేషించలేమని, ఎందుకంటే ఏ అభ్యర్ధికి కూడా సంపూర్ణ మెజారిటీ రాలేదని పరిశీలకులు భావిస్తున్నారు.  తదుపరి నేతగా ఎవరు వుండాలనే విషయంలో పార్లమెంట్‌ సభ్యులు ఎలాంటి స్పష్టత ఇవ్వనందున ఇక పూర్తి భారం కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులపైనే వుందని చెబుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన ఐదు రౌండ్లలో సునాక్‌ ప్రతీసారీ గెలుస్తూ వచ్చినా, పార్టీ కిందిస్థాయిలో పెద్దగా తెలిసిన నేత కాదని యువ్‌ గవర్‌ పోల్‌లో వెల్లడైంది. ముఖాముఖి జరిగే ఈ పోరులో ట్రస్‌ గెలిచే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేస్తున్నారు.  దేశంలో జీవన వ్యయ సంక్షోభం తీవ్రంగా కొనసాగుతున్న నేపథ్యంలో పన్నుల్లో కోత విధిస్తామని ఇరువురు అభ్యర్ధులు చెబుతూ వచ్చినా తన ప్రత్యర్ధుల్లా సునాక్‌ కల్లబొల్లి కధలు చెప్పడం లేదు. ముందుగా ద్రవ్యోల్బణం అదుపులోకి రావాలని చెబుతున్నారు.

40 ఏళ్ళలో రికార్డు స్థాయిలో జూన్‌లో 9.4 శాతానికి ద్రవ్యోల్బణం చేరింది. ఆయన ప్రత్యర్ధులు మాత్రం మొదటి రోజు నుండే పన్నులు తగ్గిస్తామని హామీలు గుప్పించేస్తున్నారు. ఆర్ధిక విధానాలపై ప్రత్యర్ధులు ఇరువురు తీవ్రమైన వాదోపవాదాలకు దిగుతున్నారు.

ఆర్థిక మంత్రిగా సునాక్‌ పన్ను విధానాలను ట్రస్‌ విమర్శిస్తూ  డైలీ మెయిల్‌కు రాసిన కాలమ్‌లో గత 70ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా పన్నుల భారాన్ని మోపారని, పన్నుల విషయంలో దేశం తప్పుడు దారిలో నడిచేందుకు ఆయనే కారణమని విమర్శించారు. ఇటీవలి పన్ను పెంపులను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఉసంహరిస్తానని ట్రస్‌ హామీనిచ్చారు.

అయితే సునాక్‌ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ   పార్టీలోని కిందిస్థాయి సభ్యులను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరో 18 మాసాల్లో జరగాల్సి ఉన్న  సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందగల సమర్ధుడైన అభ్యర్ధిని తానేనని చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కెయిర్‌ స్టార్మర్‌, లేబర్‌ పార్టీలను దీటుగా ఎదుర్కొనగల వ్యక్తి ఎవరనుకుంటున్నారని డైలీ టెలిగ్రాఫ్‌కు రాసిన కాలమ్‌లో రిషి ప్రశ్నించారు. ఆ వ్యక్తిని తానేనని తానవిశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు.

లైంగిక అక్రమాలకు సంబంధించిన ప్రతివాది గురించి జాన్సన్ మాట తర్వాత భారత సంతతికి చెందిన దేశం మాజీ ఆర్థిక మంత్రి రిషి  సునక్ ఈ నెల ప్రారంభంలో తన పదవికి రాజీనామా చేయడం ద్వారా ప్రధానిగా బోరిస్ జాన్సన్ పతనానికి కారకులయ్యారు.

మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, అతను రిషి మొదటిసారి 2015లో చట్టసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో మంత్రిగా  బ్రిటిష్ ప్రజలతో ఆయన ప్రజాదరణ పెరిగింది. ఆయన న ట్రెజరీ విభాగం అనేక మంది పౌరులకు ఆర్థిక సహాయాన్ని అందించే విధానాల శ్రేణిని ప్రకటించింది.

బ్రిటన్ ప్రస్తుత విదేశాంగ మంత్రిని, జాన్సన్‌కు చాలా విధేయురాలిగా  ఉన్నలిజ్‌ ట్రస్‌ కు  పార్టీ పరిలోని మితవాద  శాసనసభ్యుల మద్దతు  ఉంది. అట్టడుగు కార్యకర్తల మధ్య ఇటీవలి అనధికారిక పోల్‌లు కూడా ఆమె ప్రధాని పదవికి ఆమె పట్ల సానుకూలత వ్యక్తం అవుతున్నది. ఆమె పార్లమెంట్ కు అకౌంటెంట్‌గా  పనిచేసింది.  2010లో లండన్‌కు ఈశాన్య నియోజకవర్గానికి తిరిగి ఎన్నికైంది. ఆమె మొదట్లో బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించింది.

అయితే ఇటీవలి సంవత్సరాలలో బ్రిటీష్ సంబంధాల విషయంలో మరింత కఠినమైన విధానాన్ని అవలంబించింది.  యూరోపియన్ యూనియన్, బ్రిటన్  మధ్య ప్రస్తుత వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామని క్రమం తప్పకుండా బెదిరించింది. తనను తదుపరి ప్రధానిగా ఎంపిక చేస్తే పన్నులు తగ్గిస్తానని ఆమె హామీ ఇచ్చారు.