పోలవరంను ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించిన్నట్లే 

 పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.  పోలవరం ప్రాజెక్టు ఎత్తు‌ గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని పేర్కొంటూ పోలవరంను ప్రశ్నిస్తే… తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించి నట్లేనని కాగలదని ఆయన స్పష్టం చేశారు. పైగా, అది రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లు కాగలదని హెచ్చరించారు.

రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని, ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి వ్యయం భరించాలని సోము వీర్రాజు గుర్తు చేశారు. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారని, విభజన తరువాత భద్రాచలం ఆలయాన్ని, ‌మరో రెండు మండలాలు‌ తెలంగాణకు కేటాయించారని ఆయన చెప్పారు.

దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్‌కు‌ నీరు ఇవ్వాలని‌ ఆనాడు వైయస్ పనులు చేపట్టారని పేర్కొంటూ  దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందని వీర్రాజు తెలిపారు.

పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లేనని స్పష్టం కాదు అప్పుడో మాట.. ఇప్పుడో మాట అనేది సరికాదని సోము వీర్రాజు తెలంగాణ అధికార పక్ష నాయకులకు హితవు చెప్పారు. 

కాగా, పోలవరం విషయంలో  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బిజెపి నేత ఆరోపించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్  షెకావత్ ఏపీ పర్యటన తరువాత 15 రోజులకొక సారి సమీక్ష చేస్తున్నారని ఆయన చెప్పారు. లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతోందని చెబుతూ ఏపీలో పరిణామాలను బీజేపీ‌ జాతీయ నాయకత్వానికి వివరిస్తామని సోమువీర్రాజు తెలిపారు.