కన్సర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునేందుకు మంగళవారం మరో దఫా వడపోత ఎన్నిక జరిగింది. ఇందులో రిషి సునాక్ కు 118 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న పెన్నీ మోర్డాంట్‌కు 92 ఓట్లు రాగా, మూడో స్థానంలో ఉన్న లిజ్‌ట్రూజ్ 86 ఓట్లతో సరిపెట్టుకున్నారు.
ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న కెమి బడెనోచ్‌కు కేవలం 59 ఓట్లు రావడంతో ప్రధాని పదవి పోటీ నుంచి ఆమె తప్పుకోవలసి వచ్చింది. ఇలా గురువారం జరిగే చివరి రౌండ్ నాటికి బరిలో ఇద్దరే మిగులుతారు. తుది రౌండ్‌లో నిలవాలంటే 120 ఓట్లు అవసరం.
అయితే ఇప్పటివరకు కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు (టోరీ ఎంపీలు) మాత్రమే ఈ ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత తుది అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో 1,60,000 మంది అర్హులైన కన్సర్వేటివ్ పార్టీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు.
కన్జర్వేటివ్ సభ్యుల ఓట్ల లెక్కింపు ఆగస్టు చివరికల్లా పూర్తవుతుంది. తుది పోరులో గెలిచిన వ్యక్తిని సెప్టెంబర్ 5 న ప్రకటిస్తారు. ఇలా కన్సర్వేటివ్ పార్టీ నేతగా విజయం సాధించేవారే బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపడతారు.
సోమవారం మూడో రౌండ్ తర్వాత రిషి 115 ఓట్లతో నిలిచారు. అంటే నాలుగో రౌండ్‌లో ఆయన మరో ముగ్గురు ఎంపీల మద్దతే కూడగట్టగలిగారు. మోర్డాంట్ 10 మంది, ట్రస్ 15 మంది ఎంపీల మద్దతు కూడగట్టుకున్నారు. బదొనెక్‌కు ఓటేసిన 59 మంది ఎంపీల్లో ఎక్కువ మంది మద్దతును ఎవరు కూడగడతారన్నది ఆసక్తికరం.

More Stories
లాంగ్టాంగ్ పర్వతంపై కొండచరియలు విరగడంతో నేపాల్ జలవిపత్తు!
భగవత్ సభకు భద్రత, హక్కుల బాధ్యత మేయర్ దే
నేపాల్‌లో జల విలయం.. 165 మంది మృతి