తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కరోనా

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కరోనా

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (69) కరోనా బారిన పడ్డాడు. కరోనా నిర్ధారణ కావడంతో ఐసోలేషన్‌లోకి ఆయన వెళ్లారు. స్టాలిన్‌కు తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తమిళనాడు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ క్రమంలో ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్‌లో పాల్గొని జాగ్రత్తగా ఉండాలని ట్విటర్‌ ద్వారా సీఎం స్టాలిన్‌ పిలుపు ఇచ్చారు. తమిళనాడు గత కొంత రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్‌, సబ్‌ వేరియెంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. సుమారు 2 వేలకు పైనే కొత్త కేసులు తమిళనాడులో నమోదు అవుతున్నాయి.

ఇలా ఉండగా, దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,906 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య  4,36,69,850 కు చేరింది. ఇక దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,32,457 కు చేరుకుంది. కవర్ణా   పాజిటివిటి రేటు 96.98 శాతంగా ఉండగా, తాజాగా కరోనాకు 45 మంది బలయ్యారు. దీంతో  మృతుల సంఖ్య 5,25,519 కి చేరింది.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,447 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ ల సంఖ్య 4,30,11,874 కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశంలో  1,99,12,79,010 మందికి కరోనా వ్యాక్సిన్లు కేంద్ర ఆరోగ్య శాఖ వేసింది.   గడిచిన 24 గంటల్లో 11,15,068 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.