జపాన్ సెనేట్ ఎన్నికల్లో షింజో అబె విజయం 

పాన్‌ మాజీ ప్రధాని షింజో అబె హత్య నీడలో జరిగిన జపాన్‌ పార్లమెంటు ఎగువ సభ (సెనేట్‌) ఎన్నికల్లో లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీ కొమెటో సంకీర్ణ కూటమి 76 సీట్లు గెలుచుకుంది. దీంతో 125 స్థానాలున్న సెనేట్‌లో పాలక సంకీర్ణ కూటమికి తగినంత మెజార్టీ లభించింది. 

పార్టీగా చూసినప్పుడు ఎల్‌డిపి ఒక్కటే 63 స్థానాలు సాధించింది.  మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కానిస్టిట్యూషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (సిడిపి)కి 23 స్థానాలు మాత్రమే లభించాయి. 35మంది మహిళలు సెనెటర్లుగా ఎన్నిక కావడం ఎన్నిక కావడం జపాన్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. 

ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ కౌన్సిలర్స్‌)లో 170 స్థానాలున్న పాలక సంకీర్ణ కూటమి 1947 నాటి రాజ్యాంగానికి మొదటి సారి సవరణను తెచ్చేందుకు సిద్ధమవుతోంది. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే ప్రతినిధుల సభలో 166 మంది మద్దతు అవసరం. 

ఇందుకవసరమైన మెజార్టీ ఎల్‌డిపి కూటమి కలిగి ఉండడంతో రాజ్యాంగ సవరణపై అది ముందుకు వెళ్తోంది. పైగా తొమ్మిది నెలల క్రితమే పదవీ బాధ్యతలు చేపట్టిన జపాన్‌ ప్రధాని కిషిదాకి ప్రజలలో తమ ప్రభుత్వం పట్ల గల సానుకూలతను గురించి తెలుసుకోవడానికి సహితం ఈ ఎన్నికలు కీలకమైంవి. 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, అబే విధానాలను ముందుకు తీసుకెళ్లాలన్న కృత నిశ్చయంతో తన ప్రభుత్వం ఉందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో హింస, మన ప్రజాస్వామ్య పునాదులనే దెబ్బ తీస్తుందని హెచ్చరించారు.