శ్రీలంక ప్రధాని విక్రమసింఘే రాజీనామా, 13న అధ్యక్షుడి రాజీనామా 

దేశం ఘోరమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. దానికి తాను, అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఇద్దరూ రాజీనామా చేసి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పార్లమెంటులో పార్టీ నాయకులు డిమాండ్ని స్వీకరిస్తున్నట్టు చెబుతూ శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే శనివారం తన రాజీనామాను ప్రకటించారు.
“పౌరులందరి భద్రతతో సహా ప్రభుత్వ కొనసాగింపును నిర్ధారించడానికి, ఈ రోజు పార్టీ నాయకుల ఉత్తమ సిఫార్సులను నేను అంగీకరిస్తున్నాను, అఖిలపక్ష ప్రభుత్వానికి మార్గం కల్పించడానికి. దీన్ని సులభతరం చేయడానికి నేను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తాను”  అని విక్రమసింఘే ట్విట్టర్‌లో రాశారు.
 
మరోవంక, లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే జులై 13న పదవీ విరమణ చేసేందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ స్పీకర్ మహింద యాపా అబేవర్దన తెలిపారు. రాజపక్సే తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్య ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఎదుర్కొన్నారు. అంతకుముందు శనివారం రోజు నిరసనకారులు రాజపక్సే నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన పారిపోయాడని నివేదికలు తెలిపాయి.
అధ్యక్షుడుగా గొటబయా రాజపక్సా రాజీనామా చేస్తే ఆయన స్థానంలో రణీల్‌ విక్రమసింఘె అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని రాజకీయ విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలో నెలకొన్న పరిస్థితిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయించేందుకు పార్లమెంట్‌ స్పీకర్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపిన అనంతరం ప్రధాని ‘రాజీనామా’ గురించిన ప్రకటన చేయడం విశేషం.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కారణంగా మే నెలలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అన్నయ్య, అప్పటి ప్రధాని మహింద రాజపక్సే రాజీనామా చేయవలసి రావడంతో విక్రమసింఘే ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఇంతలో, కొలంబోలోని విక్రమసింఘే నివాసం వెలుపల గుమిగూడిన నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారని ఓ వార్త సంస్థ రాసుకొచ్చింది.
ఇక.. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటులో మెజారిటీ సాధించిన తర్వాత విక్రమసింఘే రాజీనామా చేస్తారని ప్రధానమంత్రి మీడియా విభాగం తెలిపింది. అప్పటి వరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని ఆయన కార్యాలయం తెలిపింది. 
 
మరోవైపు, ఆందోళనను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై విక్రమసింఘే భద్రతా సిబ్బంది దాడిచేయడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడిని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస ఖండించారు. కాగా, అధ్యక్షుడి మీడియా హెడ్ సుదేవ హెట్టియారచ్చి రాజీనామా చేశారు. దేశంలో సంక్షోభం మరింత ముదరడంతో జులై 15 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
1948లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న లంక పరిపాలన బాధ్యతలు చేపట్టేందుకు అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆయనను, రాజపక్సేను రాజీనామా చేయవలసిందిగా ఆయన పార్టీ నాయకులు పార్లమెంటు స్పీకర్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని పదవీ విరమణ నిర్ణయం తీసుకున్నారు.
ద్వీప వ్యాప్త ఇంధన పంపిణీ ఈ వారంలో పునఃప్రారంభం కానున్నందున, ప్రపంచ ఆహార కార్యక్రమ డైరెక్టర్‌ ఈ వారంలో దేశానికి రానున్నారని, అంతర్జాతీయ రుణ సుస్థిరత నివేదిక కారణంగా తాను వైదొలగాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు విక్రమసింఘే ప్రతిపక్ష పార్టీ నేతలకు తెలిపారు.